News August 7, 2024

ప.గో. జిల్లాలో నేషనల్ హైవే

image

ప.గో. జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం నుంచి భీమవరం మీదుగా తాడేపల్లిగూడెం- నిడదవోలు – విజ్జేశ్వరం మీదుగా కొవ్వూరు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి DPR పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. పేరుపాలెం బీచ్ నుంచి తాడేపల్లిగూడెం వరకు 2 వరసల రహదారి నిర్మించాలన్నది ప్రజల కోరిక. ఈ రహదారిని జాతీయరహదారిగా గుర్తించి అభివృద్ధి చేస్తే తీరప్రాంత గ్రామాల్లో ఉత్పత్తుల రవాణా సులభతరం కానుంది.

Similar News

News December 17, 2025

గోదావరి జిల్లాల్లో మొదలైన సంక్రాంతి సందడి..!

image

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. పందెం రాయుళ్లు కోడి పందేలకు సిద్ధం అవుతున్నారు. ఈసారి రూ.కోట్లలో పందేలు జరగడం ఖాయం అనే వాదన బలంగా వినిపిస్తుంది. ఎక్కడ ఎలా బరులు ఏర్పాటు చెయ్యాలి..? ఎవరు ఎవరితో సిండికేట్ అవ్వాలి..? వీఐపీలు, పందెం కాసే వారికి ఎలాంటి మర్యాదలు చెయ్యాలి..? పందేల నిర్వహణ ఎలా జరపాలనే అంశాలపై పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు పందెం రాయుళ్లు చర్చించుకుంటున్నారు.

News December 17, 2025

ఉండి: ఫలించిన ప్రియురాలు ధర్నా.. కథ సుఖాంతం

image

ఉండి మండలం మహాదేవపట్నం శివారు రామచంద్రపురానికి చెందిన భానుప్రకాష్ ఇంటి ముందు సోమవారం సాయంత్రం ప్రియురాలు దుర్గాభవాని కుటుంబ సమేతంగా సోమవారం ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి వ్యవహారం ఉండి పోలీస్ స్టేషన్‌కు చేరటంతో ఎట్టకేలకు ప్రియుడు దిగివచ్చాడు. పెళ్లి చేసికోవడానికి అంగీకరించాడు. పెద్దల సమక్షంలో పత్రాలు రాయడంతో కథ సుఖాంతమైంది.

News December 17, 2025

టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు పురపాలక సంఘాల పరిధిలోని టిడ్కో ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. జిల్లాలో ఫేజ్- 1, ఫేజ్ -2 కింద 21,424 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఇప్పటి వరకు 8,832 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించినట్లు చెప్పారు.