News March 21, 2024
ప.గో జిల్లాలో పది లక్షల కిలోల పొగాకు కొనుగోళ్లు
ఉమ్మడి జిల్లాలోని 5 పొగాకు వేలం కేంద్రాల్లో బుధవారానికి మిలియన్ (పదిలక్షల) కిలోల పొగాకు కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఈ నెల 6న వేలం ప్రారంభమైంది. కిలో రూ.240 గరిష్ఠ ధర నమోదు కాగా సగటు ధర రూ.239.46 లభించింది. ఎన్‌ఎల్‌ఎస్‌లో దాదాపు 60 మిలియన్ కిలోలకుపైగా పొగాకు పండింది. అలాగే ఒకవైపు వేలం.. మరోవైపు సాగు.. ఓవైపు పొగాకు వేలం జరుగుతుండగా.. మరోవైపు నాట్లు వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News September 10, 2024
ప.గో: కారును అడ్డగించి నగదు, బంగారం దోపిడీ
దారి కాచి 3 కాసుల బంగారం, రూ.50 వేల నగదు, సెల్‌ఫోన్ అపహరించిన ఘటనపై తణుకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఏలూరు జిల్లా గణపవరం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన తోట సత్తిపండు తన ముగ్గురి స్నేహితులతో కలిసి కారులో రాజమండ్రి నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో డీమార్ట్ వద్ద ఇద్దరు దుండగులు సత్తిపండు కారును అడ్డగించారు. అతడిని బైక్‌పై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దోపిడీకి పాల్పడ్డారు.
News September 10, 2024
పది, ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి, ఇంటర్‌లో చేరేందుకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం మంగళవారం తెలిపారు. అడ్మిషన్స్ కోసం ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 15 వరకు గడువు పొడిగించారన్నారు. రూ.200 ఫైన్‌తో 25 వరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే వారు www.apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
News September 10, 2024
ఏలూరు: ఫోన్ ఇవ్వలేదని యువతి సూసైడ్
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన అన్నాచెల్లెలు జామాయిల్ నర్సరీలో పని చేసేందుకు కుక్కునూరు మండలం గణపవరం వచ్చారు. అక్కడ పనిని బట్టి వేతనం పొందేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. చెల్లెలు (18) పని సమయంలోనూ ఎక్కువ సేపు ఫోనుతో కాలక్షేపం చేస్తుండటంతో ఆమె సోదరుడు కోపంతో ఫోన్ లాక్కున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.