News September 18, 2024
ప.గో జిల్లాలో పొగాకు మళ్లీ ఆల్ టైం రికార్డ్ ధర
ఉమ్మడి జిల్లాలోని ఎన్‌ఎల్‌ఎస్ ఏరియా పరిధిలోని పొగాకు ధర రికార్డు బద్దలు కొట్టింది. మంగళవారం జంగారెడ్డిగూడెం-1, జంగారెడ్డిగూడెం-2, కొయ్యలగూడెం వేలం కేంద్రాల్లో అత్యధికంగా రూ.408 నమోదయ్యింది. దేవరపల్లి వేలం కేంద్రంలో రూ.400, గోపాలపురంలో రూ.399 ధర పలికింది. మొత్తం ఐదు వేలం కేంద్రాల్లో 6,669 బేళ్లు రైతులు అమ్మకానికి తీసుకురాగా, వీటిలో 4,444 బేళ్లు అమ్ముడైనట్లు రైతులు పేర్కొన్నారు.
Similar News
News October 15, 2024
ప.గో: మామిడి చెట్టు పడి మహిళ మృతి
దేవరపల్లి మండలం అచ్చయ్యపాలెం గ్రామంలో మంగళవారం విషాద ఘటన నెలకొంది. గ్రామానికి చెందిన సుబ్బయ్యమ్మ పై ప్రమాదవశాత్తు మామిడి చెట్టు మీద పడడంతో మృతి చెందిందని స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 15, 2024
ఏలూరు జిల్లాలో టెట్ పరీక్షలకు 48 మంది గైర్హాజర్
ఏలూరు జిల్లాలో నిర్వహించే టెట్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయని విద్యాశాఖ అధికారి అబ్రహం మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 186 మంది విద్యార్థులకు 158 మంది, మధ్యాహ్నం 186 మందికి 166 మంది హాజరయ్యారని తెలిపారు. ఉదయం 28 మంది, మధ్యాహ్నం 20 మంది గైర్హాజరయ్యారని చెప్పారు.
News October 15, 2024
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో ఉండి ఎమ్మెల్యే
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో దిగిన చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి-2898AD చిత్రం షూటింగ్ జరుగుతున్న సందర్భంలో అశ్వథ్థామ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్‌ను కలిసి కాసేపు ముచ్చటించారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.