News August 4, 2024
ప.గో జిల్లాలో ‘ఫ్రెండ్‌షిప్ డే’న విషాదం
పశ్చిమ గోదావరి జిల్లాలో ‘ఫ్రెండ్‌షిప్ డే’న విషాదం చోటుచేసుకుంది. పేరుపాలెం బీచ్‌లో కె.జాన్‌బాబు(17) గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న మొగల్తూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జాన్‌బాబు తణుకుకు చెందిన వాడిగా గుర్తించినట్లు తెలిపారు. ఆదివారం.. అందులోనూ ఫ్రెండ్‌షిప్ డే కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా పేరుపాలెం బీచ్ వెళ్లాడు. స్నానం చేస్తూ అలల ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు.
Similar News
News September 10, 2024
గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్: కలెక్టర్
పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె మాట్లాడుతూ.. ప.గో జిల్లాలో గత నెల రోజుల నుంచి ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి అంటూ వ్యాధులు ప్రబలకుండా మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
News September 10, 2024
ఈనెల 11 నుంచి ఉచిత ఇసుక విధానం: కలెక్టర్
ఏలూరు జిల్లాలో ఈనెల 11 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉచిత ఇసుక విధానం అమలవుతుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ఇసుక సమన్వయ శాఖల అధికారులు, లారీ యజమానులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాలసీపై అవగాహన కలిగించారు. పారదర్శకంగా ఇసుక సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
News September 10, 2024
ప.గో జిల్లాలో 101 గ్రామాలకు చెక్కులు
రాష్ట్ర వ్యాప్తంగా వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 400 గ్రామ పంచాయతీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.4 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం ఉమ్మడి ప.గో జిల్లాలో 101 గ్రామాలకు చెక్కులను అందజేశారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.