News February 12, 2025

ప.గో జిల్లాలో భారీగా పడిపోయిన చికెన్ ధరలు

image

బర్డ్ ఫ్లూ ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. నిన్న మొన్నటి వరకు కిలో రూ .240 వరకు విక్రయించిన చికెన్ ,  ప్రస్తుతం రూ. 160 నుంచి రూ. 180 వరకు విక్రయిస్తున్నారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో చికెన్ విక్రయాలు ఇప్పటికే నిలిపివేయగా మిగిలిన ప్రాంతాల్లో మాత్రం వినియోగదారులు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. 

Similar News

News March 19, 2025

ప.గో : అమ్మకు చీర కొనడానికి దొంగతనం.. చివరికి

image

ఏలూరు జిల్లా చాట్రాయికి చెందిన సురేందర్ తెలంగాణలో కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాంత పోలీసులు మంగళవారం సురేందర్ నేరాలను వివరించారు. 90 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతను పశ్చిమ గోదావరి జిల్లాలోనూ దొంగతనం చేసినట్లు వెల్లడించారు. మొదటిసారి అమ్మకు చీర కొనడానికి రూ.300 దొంగతనం చేశాడన్నారు. అతడి వద్ద రూ. 45 లక్షల సొత్తు రికవరీ చేసి, రిమాండ్ కు తరలించామన్నారు.

News March 19, 2025

ఏలూరు హైవేపై కారును ఢీకొన్న లారీ

image

ఏలూరు జాతీయ రహదారిలోని ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో మంగళవారం అర్ధరాత్రి కారును లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులలో ఇద్దరు గాయపడ్డారు. లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. గుంటూరులోని ఓ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వ్యక్తిని తాడేపల్లిగూడెం తరలిస్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు.

News March 19, 2025

ఆకివీడు: భార్య ఫ్రెండ్‌పై అత్యాచారయత్నం

image

ఆకివీడు మండలం చెరుకుమిల్లి శివారు ఉప్పరగూడెం గ్రామానికి చెందిన  ద్రోణాద్రి నరసన్న అదే గ్రామానికి చెందిన మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. నరసన్న భార్య కువైట్ వెళ్లింది. తన భార్యతో ఫోన్లో మాట్లాడాలని స్నేహితురాలిని ఇంటికి పిలిచాడు. ఆమెపై అత్యాచారయత్నం చేయబోయాడు. మహిళ ఫిర్యాదుతో ఆకివీడు ఎస్ఐ హనుమంతు నాగరాజు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!