News May 10, 2024
ప.గో జిల్లాలో భారీగా బంగారం, వెండి సీజ్

ప.గో జిల్లా భీమవరం మండలం లోసరి చెక్‌పోస్ట్ వద్ద ఉదయం రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో రూ.1.87 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పాటు రెండున్నర కిలోల బంగారం, ఐదున్నర కిలోల వెండిని సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో వాటిని సీజ్ చేశామని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 7, 2025
కాళ్ల: స్థల వివాదమే హత్యకు కారణం

కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలో తమ్ముడిని అన్న హత్య చేసిన ఘటనకు స్థలం గొడవే కారణంగా తెలుస్తోంది. తమ తల్లికి చెందిన సెంటు స్థలం కోసం అన్న రమేశ్, తమ్ముడు సత్యనారాయణ మధ్య వివాదం నడుస్తోంది. 2023లో ఒకరిపై ఒకరు కేసు పెట్టుకుని రాజీ పడ్డారు. ఆ తర్వాత కూడా గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం సాయంత్రం అన్న ఇంటికి వెళ్లి రమేశ్ గొడవపడ్డాడు. సత్యనారాయణ తలపై బలంగా కొట్టడంతో రమేశ్ మృతి చెందాడు. కేసు నమోదైంది.
News February 7, 2025
అధికారులు నివేధికలు ఇవ్వాలి: కలెక్టర్

జిల్లాలో సహాకార రంగాన్ని బలోపేతం చేసేందుకు సంబంధిత శాఖలు వారి భవిష్యత్తు కార్యాచరణతో పూర్తి స్థాయి నివేదికలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేటులో 19 శాఖల అధికారులతో జరిగిన జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 688 సహకార సంఘాలు ఉన్నాయని, వాటిలో 667 సంఘాలు పని చేస్తున్నాయని జిల్లా సహకార అధికారి నాగరాజు కలెక్టర్‌కు వివరించారు.
News February 6, 2025
తమ్ముడిపై దాడి చేసిన అన్న.. చికిత్స పొందుతూ మృతి: ఎస్ఐ శ్రీనివాస్

కాళ్ల మండలంలో అన్నదమ్ముల మధ్య స్థల విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అన్న సత్యనారాయణ తమ్ముడు రమేశ్‌పై దాడి చేయగా భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కాళ్ల ఎస్ఐ ఎన్. శ్రీనివాస్ గురువారం తెలిపారు. పెదఅమిరంకు చెందిన రమేశ్ భార్య వరలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.