News September 7, 2024
ప.గో జిల్లాలో భారీ వర్షం.. ఉద్ధృతంగా కాలువలు
ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా సాయంత్రం భారీ వర్షం పడింది. కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో జీలుగుమిల్లి మండలం నుంచి బర్రింకలపాడు వెళ్లే రహదారిలో కాలువ పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలువలు, వాగులు ఉద్ధృతంగా ఉన్నప్పుడు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు కోరుతున్నారు.
Similar News
News October 15, 2024
ప.గో: మామిడి చెట్టు పడి మహిళ మృతి
దేవరపల్లి మండలం అచ్చయ్యపాలెం గ్రామంలో మంగళవారం విషాద ఘటన నెలకొంది. గ్రామానికి చెందిన సుబ్బయ్యమ్మ పై ప్రమాదవశాత్తు మామిడి చెట్టు మీద పడడంతో మృతి చెందిందని స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 15, 2024
ఏలూరు జిల్లాలో టెట్ పరీక్షలకు 48 మంది గైర్హాజర్
ఏలూరు జిల్లాలో నిర్వహించే టెట్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయని విద్యాశాఖ అధికారి అబ్రహం మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 186 మంది విద్యార్థులకు 158 మంది, మధ్యాహ్నం 186 మందికి 166 మంది హాజరయ్యారని తెలిపారు. ఉదయం 28 మంది, మధ్యాహ్నం 20 మంది గైర్హాజరయ్యారని చెప్పారు.
News October 15, 2024
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో ఉండి ఎమ్మెల్యే
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో దిగిన చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి-2898AD చిత్రం షూటింగ్ జరుగుతున్న సందర్భంలో అశ్వథ్థామ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్‌ను కలిసి కాసేపు ముచ్చటించారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.