News September 22, 2024
ప.గో. జిల్లాలో మన ఇల్లు-మన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలు, పట్టణాల్లో ఈ నెల 28న మన ఇల్లు- మన గౌరవం పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం గృహ నిర్మాణ సంస్థ అధికారులు, ఎంపీడీవోలు, పురపాలక కమిషనర్లు, ఈవోపీఆర్డీలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.
Similar News
News October 7, 2024
ప.గో.: నేటి నుంచి ప్రత్యేక రైలు
దసరా పండగను పురస్కరించుకుని నేటి నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని ఏలూరు రైల్వే
స్టేషన్ ఇన్‌ఛార్జి రమేశ్ తెలిపారు. కాకినాడ నుంచి సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, విజయవాడ, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి మీదుగా సికింద్రాబాద్‌కు, 7, 8, 9వ తేదీల్లో విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి అనపర్తి, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పొందూరు మీదుగా శ్రీకాకుళం వరకు నడపనున్నారన్నారు.
News October 7, 2024
జంగారెడ్డిగూడెం: యువకుడిపై పోక్సో కేసు నమోదు
జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఓ బాలిక గత నెల 30న ఇంటి నుంచి అదృశ్యమైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏలూరులోని షారుఖ్ ఖాన్‌పై అనుమానం ఉన్నట్లు తల్లి చెప్పడంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారు కడపలో ఉన్నట్లు తెలిసింది. నిందితుడు మాయమాటలు చెప్పి బాలికను ఇంటి నుంచి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు గుర్తించారు. దీంతో అదృశ్యం కేసును పోక్సో కేసుగా మార్పు చేశామన్నారు.
News October 7, 2024
ప.గో: TODAY TOP HEADLINES
*భీమవరం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
*తాడేపల్లిగూడెం: హత్య కేసులో నిందితుడు అరెస్ట్
*చింతలపూడి: పేకాట శిబిరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్
*ప.గో: పేరుపాలెం బీచ్‌లో పర్యాటకుల సందడి
*ఏలూరు: వ్యక్తిపై దాడి చేసిన 9 మంది అరెస్ట్
*నరసాపురం: లారీని ఢీకొన్న RTCబస్సు.. సీసీ ఫుటేజ్
*తాడేపల్లిగూడెంలో యువకుడు మృతి
*ఉండి: లక్ష దాటిన బీజేపీ సభ్యత్వాలు
*500 రక్తపరీక్ష కిట్లను అందజేసిన ఎమ్మెల్యే చింతమనేని