News December 12, 2024
ప.గో జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన
సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తానని మాజీ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ఆయన పర్యటన ఉభయ గోదావరి జిల్లాలో ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జగన్ గోదావరి జిల్లా పర్యటన చేస్తారని వైసీపీ చింతలపూడి ఇన్‌ఛార్జ్ కంభం విజయరాజు తెలిపారు. సంక్రాంతి తర్వాత జగన్ గోదావరి జిల్లా ప్రజలను కలుస్తారని చెప్పారు.
Similar News
News January 24, 2025
ప.గో. త్వరలో ఆచంటలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు
ఆచంటలో రూ.కోటి వ్యయంతో త్వరలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఉక్కు భారీ పరిశ్రమల కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. గురువారం ఆచంట మండలం ఏ వేమవరం గ్రామంలో హాస్టల్ భవనాన్ని ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. డయాలసిస్ కేంద్రం ఏర్పాటు వల్ల కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డయాలసిస్ కేంద్రం మంజూరులో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాత్ర ఎంతో ఉందన్నారు.
News January 23, 2025
ప.గో: పోక్సో కేసులో ఉపాధ్యాయుడికి జైలు శిక్ష
ఉండ్రాజవరం జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గోపాల కృష్ణమూర్తికి ఏలూరు పోక్సోకోర్టు రెండున్నరేళ్ల జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధించినట్టు ఎస్సై శ్రీనివాస్ బుధవారం తెలిపారు. 2020వ సంవత్సరం ఫిబ్రవరి 28న పాఠశాలలో ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె తల్లి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా వాదోపవాదాలు తరువాత ఈ నెల 21న కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
News January 23, 2025
పెంటపాడు: రైలు ఢీకొని వ్యక్తి మృతి
పెంటపాడు మండలం ప్రత్తిపాడు ఎస్సీ పేటకు చెందిన పెనుమాక పైడిరాజు (45) కూలీ పని చేసుకొని జీవిస్తున్నాడు. బుధవారం రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సై తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించామన్నారు. మృతుడుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.