News October 27, 2024

ప.గో: జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం

image

రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో బలహీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ శనివారం హెచ్చరిక జారీ చేసింది. దీని ప్రభావంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వర్షాల ప్రభావం బుధవారం వరకు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Similar News

News November 14, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో నేడు పెట్రోల్ , డీజిల్ ధరలు ఇలా

image

ఉమ్మడి ప.గో జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. గురువారం ఏలూరులో లీటరు పెట్రోల్ ధర రూ.109.97 ఉండగా డీజిల్ ధర రూ.97.76 ఉంది. అలాగే ప.గో జిల్లాలో డీజిల్ రూ.97.24 ఉండగా.. పెట్రోల్ ధర రూ.109.40 ఉంది.

News November 14, 2024

పెనుగొండ : కొండెక్కుతున్న ఉల్లి

image

ఉల్లిధర వినియోగదారులను కంటతడి పెట్టిస్తోంది. నెల నుంచి వారవారానికి ధర ఎగబడుతోంది. పెనుగొండ మార్కెట్‌లో ఉల్లి ధరలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పైగా కార్తీక మాసం కావడంతో ఈ వారం రోజుల్లోనే రూ. 70-80 కి చేరిందని వ్యాపారస్థులు చెబుతున్నారు. ఉల్లి దిగుమతి తగ్గడంతో ధరలు ఊపందుకున్నాయని అంటున్నారు.

News November 14, 2024

పెనుగొండ: ఏఆర్ కానిస్టేబుల్‌తో పాటు కుటుంబానికి జైలు శిక్ష

image

పెనుగొండకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ మహేంద్రకుమార్, అతని కుటుంబానికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. మహేంద్రకుమార్ భార్య చైతన్యను అదనపు కట్నం కోసం హింసిస్తూ ఉంటే అతని తల్లి, తండ్రి సహకరించేవారు. దీంతో 2020లో బాధితురాలు ఆచంట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం కోర్టు బుధవారం నిందితులకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షలు జరిమానా విధించి, ఆసొమ్మును చైతన్యకు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.