News November 12, 2024
ప.గో. జిల్లాలో రేంజ్ IG పర్యటన

ఏలూరు రేంజ్ IG అశోక్ కుమార్ సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు రూరల్ సర్కిల్, మొగల్తూరు పోలీస్ స్టేషన్లలో వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ వార్షిక తనిఖీల్లో పోలీస్ స్టేషన్లో నిర్వహించే పలు రికార్డులను పరిశీలించి, స్టేషన్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం కేసులకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు.
Similar News
News October 13, 2025
తణుకు: గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

తణుకు మండలం పైడిపర్రు కాలువలో పడి గల్లంతైన బొమ్మనబోయిన జోగేంద్ర (13) మృతదేహాన్ని పోలీసులు సోమవారం గుర్తించారు. జోగేంద్ర తన స్నేహితులతో కలిసి ఆడుకుందామని వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. అత్తిలి మండలం గుమ్మంపాడు సమీపంలో కాలువలో బాలుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News October 13, 2025
ఈనెల 17న తణుకులో జిల్లా యువజనోత్సవాలు: కలెక్టర్

ఈనెల 17న తణుకులో జిల్లా యువజనోత్సవాలు జరుగుతాయని, పోటీల్లో పాల్గొనేందుకు 15 నుంచి 29 ఏళ్ల యువకులు అర్హులని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలు నవంబర్ 2025లో విజయవాడలో జరుగుతాయని, జాతీయస్థాయి పోటీలు జనవరి 2026 ఢిల్లీలో జరుగుతాయన్నారు. దీనిలో భాగంగా ఈనెల15న భీమవరం ఎస్ఆర్ కేఆర్‌లో ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
News October 12, 2025
TPG: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

తాడేపల్లిగూడెం (M) ఎల్.అగ్రహారం జాతీయ రహదారి డివైడర్‌పై ఏలూరు వైపు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రూరల్ పోలీసులు ఆదివారం తెలిపారు. మృతుడు కోల ముఖం కలిగి టీ-షర్టు, షార్ట్ ధరించి ఉన్నాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ నంబర్ 944796612, 9441834286ను సంప్రదించాలన్నారు.