News October 3, 2024
ప.గో.జిల్లాలో వైసీపీ కనుమరుగైంది: మేకా శేషుబాబు

పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ కనుమరుగైందని వైసీపీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆరోపించారు. గురువారం పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ కనుమరుగవడానికి కారణం కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్రాజు అని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అలాగే గౌడలకు 10శాతం మద్యం షాపులు కేటాయించడం శుభ పరిణామన్నారు.
Similar News
News October 29, 2025
రేపటి నుంచి జిల్లాలో స్కూల్స్ యథాతధం: డీఈవో

మొంథా తుఫాను తీరం దాటిన నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనడంతో రేపటి నుంచి స్కూల్స్ యథాతధంగా పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఈ.నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించినప్పటికీ ప్రస్తుతం వాతావరణం నెమ్మదించడంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురువారం నుంచి యథాతధంగా పనిచేస్తాయని చెప్పారు.
News October 29, 2025
ప.గో. కలెక్టర్తో మాట్లాడిన సీఎం చంద్రబాబు

మొంథా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తతపై సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఫోన్ ద్వారా ప్రత్యేకంగా సమీక్షించారు. తుఫాన్ కంట్రోల్ రూములు, పునరావాస కేంద్రాలపై ముఖ్యమంత్రికు జిల్లా కలెక్టర్ వివరించారు. తుఫాన్ ప్రభవాన్ని ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలిస్తూ ఉండాలని సీఎం సూచించారు.
News October 29, 2025
4,155 మందికి పునరావాసం: కలెక్టర్

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 37 పునరావాస కేంద్రాల్లో మంగళవారం మధ్యాహ్నం నాటికి 4,155 మంది బాధితులకు భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 3,581 ఎకరాల వరి పొలాల్లో వర్షపు నీరు చేరిందని, జిల్లాలో తుఫాను కారణంగా 10 గ్రామాలు ముంపునకు గురి కాగలదని గుర్తించడం జరిగిందని ఆమె వెల్లడించారు.


