News December 20, 2024
ప.గో: జిల్లాలో షూటింగుల సందడి

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం పలుచోట్ల మూవీ షూటింగుల సందడి చోటుచేసుకుంది. ఏలూరు నగరంలో హుషారు ఫేమ్ దినేష్ తేజ నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ జరుగుతుంది. అలాగే జంగారెడ్డిగూడెంలో నూతన నటీనటులతో రూపొందుతున్న చిత్రం షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. అలాగే అత్తిలి మండలం గుమ్మంపాడు- ఎర్రనీలిగుంట రోడ్డులో మేము ఫేమస్ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుంది.
Similar News
News November 1, 2025
మహిళలను వేధిస్తే సహించం: కలెక్టర్ హెచ్చరిక

గృహహింస, మహిళలపై లైంగిక వేధింపులను సహించేది లేదని కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో శుక్రవారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాల నిరోధానికి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పిల్లలు లేని దంపతులు పిల్లలను దత్తత తీసుకునే విధంగా ప్రోత్సహించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు.
News October 31, 2025
నరసాపురం: సినీ గాయకుడు రాజు కన్నుమూత

నరసాపురం మండలం చిట్టవరానికి చెందిన ప్రముఖ సినీ గాయకుడు గోగులమండల రాజు (42) శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్లో గుండెపోటుతో మరణించారు. ‘పాడుతా తీయగా’ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆయన, హీరో వెంకటేశ్ నటించిన ‘లక్ష్మి’ చిత్రంలోని “తార తలుకు తార” పాటతో మంచి గుర్తింపు పొందారు. ఆయన అంత్యక్రియలు శనివారం చిట్టవరంలో జరగనున్నాయి.
News October 31, 2025
ప.గో: డెడ్ బాడీ పార్సిల్ కేసులో రాష్ట్రానికి 4 అవార్డులు

ఉండి (M) యండగండి డెడ్ బాడీ పార్సిల్ కేసు చేధనలో రాష్ట్రానికి 4 అవార్డులు దక్కాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా విజయవాడలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ నయీమ్ అస్మితో పాటు మరో ముగ్గురు అధికారులు అవార్డులు అందుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ , కేంద్రీయ గృహమంత్రి దక్షత పదక్లో అవార్డులు ప్రకటించారు. అవార్డులు అందుకున్న నలుగురు అధికారులు ప్రశంసలు అందుకుంటున్నారు.


