News September 11, 2024

ప.గో. జిల్లాలో సీఎం పర్యటన రద్దు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకివీడులో హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి అనువుగా లేనందున పర్యటనలో మార్పుచేసినట్లు అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లాలో పర్యటన యథావిధిగా కొనసాగనుండగా, పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం పర్యటన రద్దు అయినట్లు కలెక్టర్ తెలిపారు.

Similar News

News October 5, 2024

ఏలూరు: రైతులకు మంత్రి విజ్ఞప్తి

image

ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదని మంత్రి కొలుసు పార్థసారధి స్పష్టం చేశారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్టర్లు, పౌర సరఫరాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ రైస్‌మిల్లును సంప్రదించొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లాలో ఇప్పటికే 7 లక్షల గోనెసంచులు అందుబాటులో ఉంచామన్నారు.

News October 4, 2024

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC అభ్యర్థిగా గోపి మూర్తి

image

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC ఉపఎన్నికకు పీడీఎఫ్ అభ్యర్థిగా బొర్రా. గోపి మూర్తిని యుటీఎఫ్ బలపరిచింది. ఈ మేరకు ఆయన్ను బరిలో ఉంచాలని నిర్ణయించింది. ఈయన ప్రస్తుతం యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారిగా ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.

News October 4, 2024

ఏలూరు: ‘రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలి’

image

రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. స్వర్ణాంధ్ర-2047 దార్శనిక పత్రం రూపకల్పన లో భాగంగా వచ్చే ఐదేళ్లకు జిల్లా స్థాయి దార్శనిక పత్ర రూపకల్పన కోసం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరులో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.