News May 5, 2024

ప.గో జిల్లాలో 1,004 మంది ఓటింగ్ పూర్తి: కలెక్టర్

image

మే 3 జరిగిన హోం ఓటింగ్ తొలి విడతలో  85సం. నిండిన వారు 192 మంది, దివ్యాంగులు 233 మంది మొత్తం 425 మంది ఇంటి వద్ద ఓటు వేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మే 4న 85సం. పైబడినవారు 307 మంది, దివ్యాంగులు 272 మంది మొత్తం 579 ఓటు వేశారని స్పష్టం చేశారు. దీంతో జిల్లాలో మొత్తం 1,004 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారని తెలిపారు.

Similar News

News November 15, 2024

ఏలూరు: భూసేకరణపై జిల్లా కలెక్టర్ సమీక్ష

image

ఏలూరు జిల్లాలో భూసేకరణ పనులను సంబంధిత ఆర్డీవోలు ఎప్పటికప్పుడు సంబంధిత తహశీల్దార్లతో సమీక్షించి వేగవంతం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గురువారం జాతీయ రహదారులు, పరిశ్రమలు, ఫిషింగ్ ఔట్లెట్స్ ఏర్పాటు భూసేకరణ అంశాలపై ఆర్డీవోలు, తహశీల్దార్లు, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. భూసేకరణకు సంబంధించి కోర్టులలో ఉన్న కేసులు సత్వరమే పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.

News November 14, 2024

పేరుపాలెం బీచ్‌ను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌లు

image

లాల్ బహదూర్ శాస్త్రి ఐఏఎస్ ముస్సూరీకి చెందిన పదిమంది ట్రైనీ ఐఏఎస్‌లు గురువారం మొగల్తూరు మండలం బీచ్‌ను సందర్శించారు. వీరికి మొగల్తూరు మండల తహశీల్దార్ కిషోర్, ఎంపీడీవో, ఎంపీడీవో త్రిశూలపానీలు బీచ్ గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేరుపాలెం సముద్ర తీర ప్రాంతం పర్యాటకంగా ఎంతో రమ్యంగా ఉందని ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు.

News November 14, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో నేడు పెట్రోల్ , డీజిల్ ధరలు ఇలా

image

ఉమ్మడి ప.గో జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. గురువారం ఏలూరులో లీటరు పెట్రోల్ ధర రూ.109.97 ఉండగా డీజిల్ ధర రూ.97.76 ఉంది. అలాగే ప.గో జిల్లాలో డీజిల్ రూ.97.24 ఉండగా.. పెట్రోల్ ధర రూ.109.40 ఉంది.