News September 24, 2024
ప.గో. జిల్లాలో 118.6 మి.మీ. వర్షపాతం
పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 118.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా కాళ్ల మండలంలో 52.2, ఉండి 22.2, ఇరగవరం 19.0, పెనుమంట్ర 14.2, పెనుగొండ 4.2, నరసాపురం 2.8, యలమంచిలి, పెంటపాడు 1.4, ఆకివీడు 1.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు కాగా మిగిలిన ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాలేదని చెప్పారు.
Similar News
News November 16, 2024
అసెంబ్లీలో RRRతో విశాఖ ఎమ్మెల్యే వాగ్వాదం
ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ RRR, విశాఖ MLAకి మధ్య వాగ్వాదం జరిగింది. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుపై విష్ణుకుమార్ రాజు మాట్లాడుతుండగా టైం అయిపోందని RRR బెల్ కొట్టారు. ‘మీరు అప్పుడే బెల్ కొడితే ఎలా అధ్యక్షా. గంట పర్మిషన్ తీసుకున్నా’ అని MLA చెప్పగా.. ‘అందరికీ కలిపి ఒక గంట సమయం ఇచ్చారు. మీకు ఒక్కరికే కాదు. ఇంకా 25 మంది మాట్లాడాలి. త్వరగా ముగించండి’ అంటూ మరికాస్త సమయం ఇచ్చారు.
News November 16, 2024
జంగారెడ్డిగూడెం పోలీసుల కస్టడీలో బోరుగడ్డ అనిల్
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బోరుగడ్డ అనిల్‌ను జంగారెడ్డిగూడెం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతను గుంటూరులో ఓ వ్యక్తిని రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించిన కేసులో రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే అదే సమయంలో JRGలోని వేలురుపాడు పోలీస్ స్టేషన్‌లో అతనిపై మరోకేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో శుక్రవారం జంగారెడ్డిగూడెం పోలీసులు రాజమండ్రి నుంచి రెండురోజుల కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు.
News November 16, 2024
పోలవరం 45.72 మీటర్ల ఎత్తులోనే నిర్మించాలి: నారాయణ
ఏలూరు జిల్లా స్ఫూర్తి భవనంలో శుక్రవారం కొల్లేరు పరిరక్షణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులోనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే రిజర్వాయర్‌గా మారే ప్రమాదం ఉందని, విద్యుత్తు ఉత్పత్తిలో ఆటకం ఏర్పడుతుందన్నారు. రుషికొండ కట్టడాల్ని పర్యాటకరంగానికి వినియోగిస్తే ఆదాయం వస్తుందన్నారు.