News January 22, 2025

ప.గో జిల్లా పాడి రైతులకు గమనిక

image

ప.గో జిల్లాలో జనవరి 31వ తేదీ వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తామని కలెక్టర్ నాగరాణి వెల్లడించారు. పశువులకు పరీక్షలు చేసి.. గర్భకోశ మందులు, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తామన్నారు. పశు వ్యాధి నిర్ధారణ పరీక్షలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని పశు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News December 10, 2025

పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి: కలెక్టర్

image

పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి నూతన పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం ఆమె కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఇన్వెస్టర్లతో ముఖాముఖి మాట్లాడారు. నూతన పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బ్యాంకు రుణాల మంజూరుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

News December 9, 2025

రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తాం: కలెక్టర్

image

ఉద్యాన పంటల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని, దీనిలో భాగంగానే ఉద్యాన విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం (M) వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్సార్ విశ్వవిద్యాలయం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RJY)తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. తద్వారా ఉద్యాన రంగంలో మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉందన్నారు.

News December 9, 2025

భీమవరంలో రూ.25 లక్షల విరాళం

image

భీమవరంలో నిర్మిస్తున్న గ్రామ రెవెన్యూ అధికారుల భవన నిర్మాణానికి దాతలు సహకరించడం అభినందనీయమని రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్ర రాజు అన్నారు. మంగళవారం పట్టణానికి చెందిన ఆనంద ఫౌండేషన్ రూ.25 లక్షలను భవన నిర్మాణానికి ప్రకటించింది. వారి కార్యాలయంలో రూ.10 లక్షల చెక్కును రాష్ట్ర అధ్యక్షుడికి అందజేశారు. మిగిలిన వాటిని త్వరలో అందిస్తామన్నారు. వారికి రాష్ట్ర అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు.