News January 22, 2025
ప.గో జిల్లా పాడి రైతులకు గమనిక

ప.గో జిల్లాలో జనవరి 31వ తేదీ వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తామని కలెక్టర్ నాగరాణి వెల్లడించారు. పశువులకు పరీక్షలు చేసి.. గర్భకోశ మందులు, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తామన్నారు. పశు వ్యాధి నిర్ధారణ పరీక్షలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని పశు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 11, 2025
కోకోకు ధర కల్పించాలంటూ సీఎం దృష్టికి..

అంతర్జాతీయ మార్కెట్‌కు తగ్గట్టుగా కోకోకు ధర కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబును కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కోకో రైతులతో ఆయన స్వయంగా కలిశారు. ఈ సందర్భంగా కోకో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంకు వివరించారు. ఎమ్మెల్యే వెంట వట్టికూటి వెంకట రామారావు, గారపాటి శ్రీనివాస్, వీర్రాజు ఉన్నారు.
News February 10, 2025
అత్తిలి: నంది అవార్డు అందుకున్న టీచర్

అత్తిలి గ్రామానికి చెందిన తెలుగు ఉపాధ్యాయురాలు పెద్దపల్లి వెంకటరమణికి బంగారు నంది అవార్డు అందుకున్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక పురస్కారాల అకాడమీ వారు వెంకట రమణికు అవార్డును అందజేశారు. తెలుగు సాహిత్యం, కవిత్వంలో చేసిన కృషికి ఈ అవార్డు లభించినట్లు వెంకటరమణ తెలిపారు. అలాగే తెలుగు సాహిత్య, సాంస్కృతిక అకాడమీ జిల్లా అధ్యక్షురాలిగా తనను ప్రకటించినట్లు తెలిపారు.
News February 10, 2025
తణుకులో సందడి చేసిన స్టార్ హీరోలు

తణుకులో స్టార్ హీరోలు ఆదివారం సందడి చేశారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు అత్త యలమర్తి రాజేశ్వరిదేవి ఇటీవల మృతి చెందడంతో ఆదివారం తణుకులో పెద్దకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరోలు వెంకటేష్, రానా విచ్చేశారు. ఈ సందర్భంగా అభిమానులు వారిని కలిసి ఫోటోలు తీసుకున్నారు. కొద్దిసేపు అభిమానులతో వారు ముచ్చటించారు.