News February 27, 2025

ప.గో. జిల్లా ప్రజలకు ఎస్పీ సూచన

image

అనధికారిక ఘాట్లలో స్నానం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు, భక్తులకు ప.గో.జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ అన్నారు. ఈసందర్భంగా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన ఈ క్రింది ఘాట్లలో ప్రజల భద్రత నిమితం రక్షణ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. నరసాపురం టౌన్, కోడేరు, కరుగోరుమిల్లి, పెదమల్లం, సిధాంతం, దొడ్డిపట్ల ఘాట్లలో స్నానం ఆచరించాలన్నారు.

Similar News

News March 26, 2025

భీమవరం: ‘నేడు పదో తరగతి పరీక్షకు 517 డుమ్మా’

image

నేడు జిల్లాలో జరిగిన టెన్త్ భౌతిక శాస్త్ర పరీక్షకు 22,894 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 22,357మంది విద్యార్థులకు 517 గైర్హాజరయ్యారని డీఈవో నారాయణ తెలిపారు. ఓపెన్ స్కూల్ సైన్స్ , అండ్ టెక్నాలజీ పరీక్షకు 487 మంది విద్యార్థులకు గాను 379 విద్యార్థులు హాజరు కాగా 108 గైర్హాజరయ్యారని చెప్పారు.

News March 26, 2025

అచ్చెన్నకు నిమ్మల బర్త్‌ డే విషెస్

image

ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచెన్నాయుడు జన్మదినం. ఈ సందర్భంగా ఆయనను మంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. అమరావతిలోని అచ్చెన్న కార్యాలయానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పూల బొకే అందించి శాలువాతో సన్మానం చేశారు.

News March 26, 2025

ప.గో: వైసీపీకి షాక్ తప్పదా..?

image

ప.గో జిల్లాలో వైసీపీకి షాక్ ఇవ్వడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. అత్తిలి, యలమంచిలి ఎంపీపీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. యలమంచిలో 18 ఎంపీటీసీలకు గాను వైసీపీ 13, జనసేన 1, టీడీపీ 3 చోట్ల గెలిచింది. ఓ సీటు ఖాళీగా ఉంది. అత్తిలిలో టీడీపీకి 5, వైసీపీకి 15 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఆ రెండు చోట్లు ఐదారు మందిని కూటమిలోకి లాగి ఎంపీపీ పదవులను కైవసం చేసుకోవడానికి NDA నాయకులు పావులు కదుపుతున్నారు.

error: Content is protected !!