News October 27, 2024

ప.గో: జిల్లా TODAY HEADLINES

image

➣కేంద్ర జలశక్తి కమిటీ సభ్యునిగా ఎంపీ మహేశ్ నియామకం
➣పెదపాడు: జూద స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్టు
➣పెనుగొండలో 40 కిలోల గంజాయి స్వాధీనం
➣కలెక్టర్ వెట్రిసెల్విని కలిసిన జంగారెడ్డిగూడెం ఆర్డీవో
➣పంచారామ క్షేత్రాలకు తణుకు డిపో నుంచి ప్రత్యేక బస్సులు
➣ఉంగుటూరు: ఆక్వా ప్రదర్శనను పరిశీలించిన త్రిపుర గవర్నర్
➣పాలకొల్లు: గుర్తుతెలియని మృతదేహాం కలకలం
➣భీమవరం: ఆర్టీసీ బస్సులోనే కండక్టర్ మృతి

Similar News

News December 5, 2025

ప.గో: తల్లిని కాపాడిన కొడుకు

image

భీమవరం మండలం జొన్నలగురువు గ్రామానికి చెందిన ఎన్.దీక్షిత్ సమయస్ఫూర్తి ప్రదర్శించి తన తల్లి ప్రాణాలను కాపాడాడు. శుక్రవారం ఎంపీపీ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్‌కు దీక్షిత్ తన తల్లిని పిలవడానికి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఆమె విద్యుత్ షాక్‌కు గురై ఉండటాన్ని గమనించాడు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. దీంతో తల్లికి పెను ప్రమాదం తప్పింది. దీక్షిత్‌ను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

News December 5, 2025

ప.గోలో 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరందించేలా ప్రాజెక్ట్

image

జిల్లాలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.1,400 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. 16 మండలాల పరిధిలోని 862 గ్రామాల్లోని 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీని కోసం 2,662 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

News December 5, 2025

నేడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: DEO

image

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.