News October 25, 2024
ప.గో: జిల్లా TODAY TOP NEWS

*విశాఖలో టూరిజం సమ్మిట్‌లో పాల్గొన్న మంత్రి దుర్గేశ్
*ప.గో జిల్లాలోనే మాటేసి తిరుగుతున్న చిరుత
*జంగారెడ్డిగూడెంలో వెలుగు చూసినా ఘరానా మోసం
*భీమడోలు స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని ఎంపీకి వినతి
*ఉండ్రాజవరం: వివాహిత అదృశ్యంపై కేసు నమోదు
*వేలేరుపాడు: ‘పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తాం’
*నిడదవోలు: ఆర్టీసీ బస్సులు రూట్ మళ్లింపు
*12.040 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: జేసీ ధాత్రిరెడ్డి
Similar News
News October 19, 2025
భీమవరం: రేపు పీజీఆర్‌ఎస్ రద్దు

దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 20వ తేదీ (సోమవారం) జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. సోమవారం దీపావళి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు.
News October 19, 2025
పాలకొల్లు: అక్వా రైతులను ఆదుకోవాలని మంత్రికి వినతి

పాలకొల్లు పర్యటనకు విచ్చేసిన వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుకు శనివారం జైభారత్ క్షీరారామ అక్వా రైతు సంఘం అధ్యక్షుడు జి. గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో అక్వా రైతులు వినతిపత్రం సమర్పించారు. ఫీడ్ ధరలు పెరగడం, రొయ్య కౌంట్ రేటు పెరగకపోవడంతో తాము నష్టపోతున్నామని మంత్రికి వివరించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రైతులు తెలిపారు.
News October 18, 2025
పేదలకు ఉచిత న్యాయ సలహా: జడ్జి కే. మాధవి

పేదలకు ఉచిత న్యాయ సలహా, సహాయాన్ని అందిస్తామని తాడేపల్లిగూడెం సీనియర్ సివిల్ జడ్జి కే. మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సూర్యకిరణ్ శ్రీ తెలిపారు. శనివారం పెంటపాడు, గణపవరం పంచాయతీ కార్యాలయాల వద్ద వారు న్యాయ సహాయ సేవా కేంద్రాలను ప్రారంభించారు. న్యాయపరమైన సమస్యలకు ఉచితంగా పరిష్కారం అందిస్తామన్నారు. చిన్న సమస్యలను ‘లీగల్ ఎయిడ్ క్లినిక్’ ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు.