News May 30, 2024

ప.గో: జీవశాస్త్రం పరీక్షకు 2,748 మంది హాజరు

image

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా గురువారం జీవశాస్త్రం పరీక్ష నిర్వహించారు. 7,058 మంది విద్యార్థులకు గాను 4,310 మంది హాజరయ్యారు. 2,748 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌వి.రమణ తెలిపారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని అన్నారు.

Similar News

News November 17, 2024

దేవరపల్లి: కార్తీకమాసంలో చికెన్ ధరలు ఇలా

image

ప.గో జిల్లాలోని పలు ప్రాంతాలలో చికెన్ పై శ్రావణమాసం ఎఫెక్ట్ పడుతోంది. అయితే జిల్లాలో పలుచోట్ల ధరలు తగ్గితే .. కొన్నిచోట్ల మాత్రం సాధారణంగానే ఉన్నాయి. కాగా దేవరపల్లి మండలంలోని దుద్దుకూరు గ్రామంలో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. కేజీ ఫారం మాంసం రూ. 200గా ఉంది, బ్రాయిలర్ రూ. 220 ఉంది. అయితే కార్తీకమాసం కావడంతో వినియోగదారులు తక్కువగా ఉన్నారని వ్యాపారస్థులు చెబుతున్నారు.

News November 17, 2024

తాడేపల్లిగూడెంలో ఎయిర్ పోర్ట్

image

రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, అందులో పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం ఒకటి. ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం ఆ ప్రాంతంలో 1,123 ఎకరాలను గుర్తించింది. పారిశ్రామిక , వ్యాపార , పర్యాటకం ఇలా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

News November 17, 2024

ప.గో : బాలికపై అత్యాచారం

image

చాగల్లుకు చెందిన బాలిక(14)పై వరుసకు మేనమామ అయే కమల్(22) అత్యాచారం చేశాడు. పోలీసుల కథనం..బాలిక సమిశ్రగూడెం ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్లో చదువుకుంటోంది. ఆధార్‌లో మార్పులు చేయడానికి తాడేపల్లిగూడెం వాసి కమల్‌ను బాలిక అమ్మమ్మ పంపింది. అతను తీసుకొచ్చి అత్యాచారం చేసి వాళ్ల ఇంట్లో అప్పగించాడు. బాలిక ఇంట్లో విషయం చెప్పగా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.