News July 20, 2024
ప.గో.: జులై 22 వరకు సముద్రంలో వేట నిషేధం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో సముద్రం అల్ల కల్లోలంగా మారింది. కెరటాలు ఎగసిపడుతున్నాయి. ప.గో. జిల్లాలోని చినలంక, పీఎం లంక, పేరుపాలెం, కేపీపాలెం వద్ద సముద్రం ఉద్ధృతంగా కనిపిస్తోంది. అల్పపీడనం హెచ్చరికతో మత్స్యశాఖ అధికారులు ఈ నెల 22 వరకు వేట నిషేధ ఆజ్ఞలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన బోట్లన్నీ తీరానికి చేరుకుంటున్నాయి. కొన్ని నరసాపురం వద్దకు రాగా మరికొన్ని అంతర్వేదిలో ఆగాయి.
Similar News
News December 1, 2024
వెలవెలబోయిన పేరుపాలెం బీచ్
కార్తీక మాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే పర్యాటకులతో కళకళలాడే పేరుపాలెం బీచ్ ఆదివారం వెలవెలబోయింది. అల్పపీడనం ఎఫెక్ట్‌తో బీచ్‌లో పెద్ద పెద్ద రాకాసి అలలు వస్తుండడంతో పోలీస్ యంత్రాంగం పర్యాటకులను రావొద్దని హెచ్చరించింది. దీంతో పర్యాటకులు బీచ్‌కు రాకపోవడంతో ఖాళీగా దర్శనమిచ్చింది.
News December 1, 2024
కాళ్ల: లారీని ఢీకొట్టిన బైక్.. ఒకరు స్పాట్ డెడ్
బతుకుతెరువు కోసం చేపలు వేటకు వెళ్తూ కాళ్ల మండలం సీసలి గ్రామంలో లారీని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. జువ్వలపాలెంకి చెందిన పైడిరాజు, చోడవరపు మధుబాబు బొండాడ లంక వేటకు వెళ్తూ ఎర్రయ్య రైస్ మిల్ వద్ద లారీని ఢీకొట్టారు. దీంతో పైడిరాజు మృతి చెందగా.. గాయపడిన మధుబాబును వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కాళ్ల ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
News December 1, 2024
రైతులకు కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే..
ప.గో జిల్లాలో ఫెంగల్ తుఫాను ప్రభావం ఉండటంతో రైతులు నష్టపోకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలను రైతులకు జారీ చేశారు. వరి కోతలు రెండు రోజులు వాయిదా వేసుకోవాలని, అలాగే ఇప్పటికే కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని వర్షానికి తడవకుండా భద్రపరుచుకోవాలి అన్నారు. సమాచారం కోసం 8121676653, 18004251291 సంప్రదించవచ్చని అన్నారు.