News April 7, 2024

ప.గో.: టీడీపీకి షాక్.. బీసీ నేత రాజీనామా

image

ప్రముఖ బీసీ నేత, బీసీ సాధికారత రాష్ట్ర కన్వీనర్‌ చలమోలు అశోక్‌ గౌడ్‌ శనివారం టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలో అవమానాలు, వేధింపులు తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అంటే ఆత్మాభిమానం కలిగిన వర్గాలే తప్ప పల్లకీలు మోసే బోయలు కాదని అన్నారు. 

Similar News

News January 22, 2025

ప.గో జిల్లా పాడి రైతులకు గమనిక

image

ప.గో జిల్లాలో జనవరి 31వ తేదీ వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తామని కలెక్టర్ నాగరాణి వెల్లడించారు. పశువులకు పరీక్షలు చేసి.. గర్భకోశ మందులు, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తామన్నారు. పశు వ్యాధి నిర్ధారణ పరీక్షలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని పశు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 21, 2025

Photo Of The Day: భార్యాభర్త ఫైరింగ్

image

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలో ఇవాళ పోలీస్ ఫైరింగ్ శిక్షణ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏలూరు ఎస్పీ శివ ప్రతాప్ కిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి పాల్గొన్నారు. భార్యాభర్తలైన ఎస్పీ, జేసీ ఒకేసారి ఇలా పక్కపక్కనే నిలబడి ఫైరింగ్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

News January 21, 2025

ప.గో. కోళ్లకు అంతు చిక్కని వైరస్.. లక్షకు పైగా మృతి

image

కోళ్లకు అంతుచిక్కని వైరస్ సోకి మృత్యువాత పడటంతో కోళ్ల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులుగా జిల్లాలో లక్షకు పైనే కోళ్లు మృతి చెందినట్లు చెబుతున్నారు. పందెం కోళ్లకు సైతం వైరస్ సోకి చనిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఉదయం ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు సాయంత్రానికి మృతి చెందుతున్నాయని చెబుతున్నారు. వైరస్ ప్రభావంతో అమ్మకాలు తగ్గి, ధరలు పతనమవుతున్నాయని అంటున్నారు.