News May 19, 2024
ప.గో.: తాను చనిపోయినా.. మరొకరికి ప్రాణం

ప.గో. జిల్లా యలమంచిలి మండలం కుమ్మరిపాలేనికి చెందిన పవన్ (19) ఇటీవల ఇంటివద్ద కొబ్బరిచెట్టు మీదపడగా గాయపడ్డాడు. విశాఖ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. అవయవదానం చేస్తే మరొకరికి ప్రాణం పోస్తాయని ఆలోచించి పుట్టెడు దు:ఖంలోనూ తల్లిదండ్రులు శ్రీనివాస రావు, శ్రీదేవి ముందుకొచ్చారు. కుమారుడి అవయవాలను విశాఖ కిమ్స్‌లో దానం చేశారు. అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు జరిపారు.
Similar News
News November 9, 2025
తణుకు: బీసీ వసతి గృహంలో కలెక్టర్ తనిఖీలు

తణుకులోని పాత ఊరు బాలికల బీసీ హాస్టల్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థినులతో మాట్లాడి, అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, రుచిగా ఉందా అని ఆరా తీశారు. డైనింగ్ హాల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News November 9, 2025
ఇరగవరం: విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యపాలెం వద్ద ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరి కోత మిషన్‌ను వ్యాన్‌లో తరలిస్తుండగా, 11 కేవీ విద్యుత్ తీగలు తగిలాయి. ఈ ప్రమాదంలో ప.గో జిల్లా ఇరగవరం మండలానికి చెందిన కె. సింహాద్రి అప్పన్న (58), జి. సందీప్ (26) విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతితో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News November 9, 2025
భీమవరం: భక్త కనకదాసు జయంతి

భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు శ్రీ భక్త కనకదాస జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త అని అన్నారు.


