News May 19, 2024
ప.గో.: తాను చనిపోయినా.. మరొకరికి ప్రాణం
ప.గో. జిల్లా యలమంచిలి మండలం కుమ్మరిపాలేనికి చెందిన పవన్ (19) ఇటీవల ఇంటివద్ద కొబ్బరిచెట్టు మీదపడగా గాయపడ్డాడు. విశాఖ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. అవయవదానం చేస్తే మరొకరికి ప్రాణం పోస్తాయని ఆలోచించి పుట్టెడు దు:ఖంలోనూ తల్లిదండ్రులు శ్రీనివాస రావు, శ్రీదేవి ముందుకొచ్చారు. కుమారుడి అవయవాలను విశాఖ కిమ్స్‌లో దానం చేశారు. అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు జరిపారు.
Similar News
News December 5, 2024
పెనుమంట్ర: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లింద్రపర్రులో గురువారం ఆటో బైక్ ఢీకొన్న ప్రమాదంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన హరి(15) మృతి చెందాడు. మృతుడు కోత మెషీన్‌పై పని నిమిత్తం ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్నేహితులు పెనుమంట్ర పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం 108లో తణుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
News December 5, 2024
టీడీపీలో ఆళ్ల నాని చేరికకు బ్రేక్?
ఏలూరు మాజీ MLA ఆళ్ల నాని టీడీపీలో చేరికపై బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆయన రాకను స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. నిన్న MLA బడేటి చంటితో పాటు పలువురు నేతలు సీఎం చంద్రబాబుని కలిసి పార్టీలో చేర్చుకునే నిర్ణయంపై పునరాలోచించాలని విన్నవించినట్లు తెలిసింది. వైసీపీ హయాంలో ఆయన టీడీపీ నేతలను వేధింపులకు గురిచేశారని, అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టారని సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
News December 5, 2024
ఉభయ గోదావరి జిల్లాల్లో ఓటు వేయనున్న 16,737 మంది టీచర్లు
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు జరగనున్నాయి. దీంతో అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో దాదాపు 16,737 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. నేడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఈ నెల 9న కాకినాడ జేఎన్టీయూలో కౌంటింగ్ జరగనుంది.