News March 8, 2025

ప.గో: తొలి ప్రయత్నంలోనే DSP అయ్యారు..!

image

డాక్టర్ చదివిన ఓ మహిళ అనూహ్యంగా పోలీసయ్యారు. అదీనూ తొలిప్రయత్నంలోనే కావడం విశేషం. ఆమే నరసాపురం డీఎస్పీ డాక్టర్ జి.శ్రీవేద. పోలీసు కావాలనే లక్ష్యంతో డాక్టర్‌గా పనిచేస్తూనే గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించారు. నరసాపురం డీఎస్పీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలరని ఆమె చెప్పారు. #HappyWomensDay

Similar News

News November 28, 2025

భీమవరంలో మాక్ అసెంబ్లీ

image

మాక్ అసెంబ్లీ నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని హెచ్.ఎం. కె. కృష్ణకుమారి అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భీమవరంలోని ఝాన్సీలక్ష్మీబాయి మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థినులు గురువారం మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగం తయారు చేయడానికి ముందు, తర్వాత ప్రజల జీవన విధానం ఎలా ఉండేదో తెలిపే స్కిట్‌ను కూడా పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించారు.

News November 27, 2025

కంబోడియా సూత్రధారి.. ప.గోలో 13 మంది అరెస్టు

image

భీమవరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ నుంచి రూ.78 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. కంబోడియాకు చెందిన ప్రధాన సూత్రధారి రహేత్ జె నయన్ సహకారంతో.. ‘కార్డ్ డీల్’ పద్ధతిలో ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 13 మందిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.