News October 4, 2024
ప.గో: దసరా వేళ.. భారీగా వసూళ్లు

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఇతర ప్రాంతాలలో ఉద్యోగాలు, పనులు చేసుకొనే వారు ప.గో జిల్లాలోని సొంతూళ్లకు పయనమయ్యారు. అయితే పండుగకు నెల రోజుల క్రితమే రైలు, ఇతర ఆర్టీసీ బస్సు సీట్లు బుక్ అయిపోయాయి.ఇదే అదనుగా ప్రైవేటు యాజమాన్యం అధిక రేట్లు పెంచి రెచ్చిపోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక రూ.వేలలో చెల్లించి ఊరికి చేరుతున్నారు. దీనిపై ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News January 5, 2026
పాలకొల్లు: ఇంటికి వెళ్లడానికి 4 గంటలు ఉందనగా..

పాలకొల్లుకు చెందిన దంపతులు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందారు. క్రిస్మస్ సెలవులకు స్వగ్రామం వచ్చి, తిరిగి వెళ్తుండగా ఇంటికి చేరడానికి మరో 4 గంటల సమయం ఉందనగా ఈ విషాదం జరిగింది. మృతులు కొటికలపూడి రాజమోహన్ రావు కుమారుడు, కోడలుగా గుర్తించారు. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేదని వచ్చి చూసి వెళ్తుండగా మృత్యువాత పడటంతో పాలకొల్లులో విషాద ఛాయలు అలముకున్నాయి.
News January 5, 2026
ప.గో: లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

పాలకొల్లుకు చెందిన ప్రేమికులు రమేశ్, భాగ్యశ్రీ ఆదివారం తాళ్లరేవు మండలం సుంకరపాలెంలోని ఓ లాడ్జిలో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన యాజమాన్యం కోరంగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని చికిత్స కోసం యానం ఆసుపత్రికి తరలించారు. ఈ నెల ఒకటో తేదీన వారు గది తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎస్ఐ సత్యనారాయణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 5, 2026
తాడేపల్లిగూడెం YCP ఇన్ఛార్జ్ ఎవరో?

తాడేపల్లిగూడెం YCP ఇన్ఛార్జ్ మార్పుపై సర్వత్రా చర్చ సాగుతోంది. ప్రస్తుత ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణపై అసంతృప్తి నెలకొనడంతో కొత్తవారి కోసం పార్టీ హైకమాండ్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇన్ఛార్జ్ రేసులో వడ్డి రఘురాం, కొట్టు నాగు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికి పగ్గాలు అప్పగిస్తారు లేదా ఇద్దరికీ బాధ్యతలు పంచుతారా అనే అంశంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.


