News June 15, 2024
ప.గో: దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం
ప.గో జిల్లా అత్తిలి మండలం స్కిన్నెరపురానికి చెందిన ఏసురాజు అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(6)ను అత్యాచారం చేశాడనే ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేశామని SI రాంబాబు తెలిపారు. బాలిక ఆడుకుంటున్న సమయంలో ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు తెలిపారు. ఆమెకు కడుపులో నొప్పి రావడంతో తల్లి అసలు విషయం తెలుసుకుని ఈనెల 9న ఫిర్యాదు చేసింది. దీంతో ఏసురాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించామని అన్నారు.
Similar News
News September 18, 2024
పేరుపాలెం బీచ్‌లో గల్లంతైన యువకుడు ఇతనే
పేరుపాలెం బీచ్‌లో ఓ యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. వివరాలు.. భీమవరం పట్టణం మెంటేవారితోటకు చెందిన రాజు, రత్న దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రభు చరణ్ బర్త్‌డే సందర్భంగా తమ్ముడు ప్రవీణ్ కుమార్, స్నేహితులతో కలిసి బీచ్ వెళ్లారు. ఈ క్రమంలో బీచ్‌లో స్నానం చేస్తుండగా ప్రవీణ్ గల్లంతయ్యాడు. అంతకు ముందు గణేశ్ ఉత్సవాల్లోనూ పాల్గొన్నాడని అంతలోనే ఇలా అయిందని కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
News September 18, 2024
ప.గో.: వైసీపీ నేత సస్పెండ్
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన మేకా శేషుబాబుని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఏ మేరకు పార్టీ అధిష్ఠానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సు మేరకు పార్టీ అధినేత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
News September 18, 2024
గంజాయి నిర్మూలనపై 100 రోజులు ప్రణాళిక: DGP
ఏలూరు రేంజ్ పరిధిలోని వివిధ జిల్లాల ఎస్పీలతో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు బుధవారం ఏలూరులో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గంజాయి నిర్మూలనకు 100 రోజులు ప్రణాళిక రూపొందించామన్నారు. గంజాయి, మాదకద్రవ్యాలపై ప్రజలకు, చిన్న పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. పోలీసుల పనితీరును మెరుగుపరచుకోవాలన్నారు.