News April 29, 2024
ప.గో.: దారుణం.. కోడలిని చంపిన అత్త, మామ

ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. గ్రామానికి చెందిన లక్కోజు కేశవరావు, భార్య సూర్యకుమారి కలిసి కోడలు నాగ శ్రావణి(25)ని రోకలిబండతో కొట్టి హత్యచేశారు. శ్రావణి భర్త శ్రీనివాసరావు ప్రస్తుతం ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్నాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. శ్రావణి తల్లిదండ్రులు విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 14, 2026
ప్రైవేటు స్కూళ్ల అడ్మిషన్ల ప్రకటనలతో జాగ్రత్త: డీఈవో

అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలు 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లు ఇచ్చే ప్రకటనలను నమ్మవద్దని డీఈవో నారాయణ తల్లిదండ్రులను హెచ్చరించారు. పాఠశాలకు గుర్తింపు ఉందో లేదో, భవన వసతులు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ప్రకటనలు జారీ చేసే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
News April 14, 2026
కలెక్టరేట్‌లో ఉద్యోగాలంటూ SMలో వైరల్.. ఖండించిన కలెక్టర్

జిల్లా కలెక్టరేట్‌లో రాత పరీక్ష లేకుండా 40 పోస్టుల భర్తీ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఖండించారు. ఈ వీడియోలు పూర్తిగా అవాస్తవమని, నిరుద్యోగులు వీటిని నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఉద్యోగాల పేరిట ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, ఏదైనా సమాచారం ఉంటే ఒకటికి రెండుసార్లు అధికారికంగా సరిచూసుకోవాలని ఆమె సూచించారు. నకిలీ వార్తలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.