News August 3, 2024
ప.గో: దారుణం.. చోరీకి వెళ్లి వృద్ధురాలిపై అత్యాచారం
వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేయాలని చూసిన ఇద్దరిని పాలకొల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. ప.గో SP ఆద్నాన్ నయీం అస్మీ వివరాల ప్రకారం.. గత నెల 29న పాలకొల్లులోని ఓ ఇంటిలో బొక్కా రాజు, మీసాల మావుల్లు చోరీకి వెళ్లారు. ఇంట్లో ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి ఆభరణాలు లాక్కున్నారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వృద్ధురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు ఈరోజు నిందితులను అరెస్ట్ చేశారు.
Similar News
News September 11, 2024
గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని, దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ నేపథ్యంలో వశిష్ట గోదావరి వద్ద నీటిమట్టం పెరుగుతుందని, లంక గ్రామాలు, పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. అత్యవసరమైతే తప్ప బోట్ల ద్వారా రాకపోకలు సాగించవద్దని హెచ్చరించారు.
News September 10, 2024
రేపు ప.గో జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ప.గో జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పట్టణంలో సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించనున్నారు. ఆకివీడు పట్టణంలోని ఉప్పుటేరు ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తారని కూటమి నాయకులు తెలిపారు.
News September 10, 2024
ప.గో: కారును అడ్డగించి నగదు, బంగారం దోపిడీ
దారి కాచి 3 కాసుల బంగారం, రూ.50 వేల నగదు, సెల్‌ఫోన్ అపహరించిన ఘటనపై తణుకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఏలూరు జిల్లా గణపవరం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన తోట సత్తిపండు తన ముగ్గురి స్నేహితులతో కలిసి కారులో రాజమండ్రి నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో డీమార్ట్ వద్ద ఇద్దరు దుండగులు సత్తిపండు కారును అడ్డగించారు. అతడిని బైక్‌పై నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దోపిడీకి పాల్పడ్డారు.