News December 26, 2024
ప.గో: దిశ మార్చుకున్న అల్పపీడనం..వర్షాలు ఎక్కడంటే
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం దిశ మార్చుకుందని విశాఖ వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. దక్షిణ తమిళనాడు, ఉత్తర తమిళనాడుకు సమీపంలో కొనసాగుతోంది. గురువారానికి వాయవ్యంగా పయనించి పశ్చిమ మధ్య, తీరానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో బలహీనపడుతుందని తెలిపింది. ఈ ప్రభావంతో నేడు, రేపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని రైతులు జాగ్రత్తలు పాటించాలన్నారు.
Similar News
News December 28, 2024
నిడదవోలు: యువతి అదృశ్యంపై కేసు నమోదు
నిడదవోలు మండలం కోరుమామిడికి చెందిన దేనాబోయిన అమర్నాథ్ కుమార్తె సునీత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు సమిశ్రగూడెం ఎస్సై వీరబాబు తెలిపారు. శనివారం ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం సునీత నిడదవోలు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియెట్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతుందన్నారు. ఈనెల 27న ఉదయం కళాశాలకు వెళ్లి ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదని, అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
News December 28, 2024
ప.గో: గన్ మిస్ ఫైర్..రిటైర్డ్ ఉద్యోగికి గాయాలు
సర్వీసు గన్ మిస్ ఫైర్ అయిన ఘటనలో రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి స్వల్ప గాయాల పాలయ్యాడు. నిడదవోలు మండలం కాటకోటేశ్వరంకు చెందిన మిలిటరీ ఉద్యోగి కారింకి శ్రీనివాస్ తన గన్‌ను ప్రతి 6 నెలలకోసారి నిడదవోలు సీఐ కార్యాలయంలో తనిఖీ చేయిస్తుంటారు. గురువారం నిడదవోలు పోలీస్ కార్యాలయానికి తన గన్‌ను చెక్ చేయించడానికి తీసుకువచ్చి స్టేషన్ బయట కూర్చుని గన్ శుభ్రం చేస్తుండగా ట్రిగ్గర్ వేలికి తగిలి మిస్ ఫైర్ అయ్యింది.
News December 28, 2024
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంపై మరోమారు డ్రోన్ కలకలం
ద్వారకాతిరుమల చిన వెంకన్న క్షేత్రంలో శుక్రవారం రాత్రి మరోమారు డ్రోన్ ఎగుర వేయడం దుమారం రేపింది. ఇటీవల శ్రీవారి క్ష్రేతం మీదుగా ఓ యూట్యూబర్ డ్రోన్ ఎగురవేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో యూట్యూబర్‌పై ఆలయ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. వరుసగా రెండో సారి ఘటన చోటు చేసుకుంది. సిబ్బంది డ్రోన్ ఎగుర వేసిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినా వారు చిక్కలేదు.