News February 4, 2025

ప.గో: నగ్న చిత్రాలు పేరుతో రూ.2.53 కోట్లు స్వాహా

image

అశ్లీల వీడియోల పేరుతో బెదిరించి నిడదవోలు శాంతి నగర్‌కు చెందిన యువతి నుంచి రూ.2.53 కోట్లు కాజేసిన నినావత్ దేవనాయక్‌‌ను గుంటూరులో అరెస్ట్ చేసినట్లు సీఐ తిలక్ సోమవారం తెలిపారు. యువతి HYD విప్రోలో ఉద్యోగం చేస్తోంది. యువతి నగ్న చిత్రాల తన వద్ద ఉన్నాయని వాటిని ఇంటర్నెట్‌లో పెట్టకుండా ఉండాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేశాడన్నారు. నిందితుడి వద్ద రూ.1.84 కోట్ల నగదు, స్థిరాస్తులను సీజ్ చేశామన్నారు.

Similar News

News January 21, 2026

కడప: శ్రీరామ శోభాయాత్ర.. పాఠశాలలకు సెలవు

image

శ్రీరాముని శోభాయాత్ర సందర్భంగా కడప నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం శ్రీరాముని కళ్యాణంతో పాటు రేపు ఉదయం నుంచి మహా శోభాయాత్ర కడప నగరంలోని అన్ని ప్రాంతంలో జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News January 21, 2026

‘ఆత్మ’తో రైతులకు సాంకేతికత చేరువయ్యేనా..!

image

అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ(ATMA)పై విమర్శలొస్తున్నాయి. సాగులో వచ్చే సాంకేతిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడం, శిక్షణ తరగతులు, ప్రదర్శనలు, కిసాన్ మేలా చేపట్టాల్సి ఉన్నా ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఏడాదికి 715 కార్యక్రమాలు జరగాల్సి ఉండగా 131 మాత్రమే చేపట్టారు. GOVT ₹59.52 లక్షలు మంజురు చేయగా ₹9.34 లక్షలు మాత్రమే రైతుల శిక్షణలకు కేటాయించారు. ఈ నిర్లక్ష్యంపై పలువురు మండిపడుతున్నారు.

News January 21, 2026

మహబూబాబాద్: మహిళా ఓటర్లే అధికం!

image

ఇటీవల ప్రకటించిన మున్సిపాలిటీ ఓటర్ల తుది జాబితాలో పురుషుల కంటే 4,267 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఆయా మున్సిపాలిటీల్లో ఉన్న ఓటర్లు వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబాబాద్- పురుషులు 31,550, మహిళలు 34,121
తొర్రూర్ – పురుషులు 10,501, మహిళలు 10,942
మరిపెడ- పురుషులు 6,709, మహిళలు 6,978
కేసముద్రం- పురుషులు7,754, మహిళలు 8,191
డోర్నకల్ -పురుషులు 5,160, మహిళలు 5,709.