News May 22, 2024
ప.గో.: నాన్న తిట్టాడని SUICIDE

పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప.గో. జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుమంట్ర మండలం భట్లమగుటూరుకు చెందిన పి.శివకుమార్ (22) తండ్రి మందలించాడని మనస్తాపం చెంది పొలంలో పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతణ్ని స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు.
Similar News
News October 14, 2025
ఆదర్శ గ్రామాలలో పనులు చేపడతాం: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద గ్రామాల అభివృద్ధి ప్రణాళికపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. జిల్లాలో మొదటి విడతలో 11, రెండో విడతలో 14 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేస్తామన్నారు. మొదటి విడత 11 గ్రామాలకు బడ్జెట్ను కేటాయిస్తామన్నారు. ఆయా గ్రామాల్లో పనులను చేపట్టి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
News October 14, 2025
ఆకివీడు: రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి

ఆకివీడు – పల్లెవాడ రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం గుర్తు తెలియని వృద్ధుడు (సుమారు 60 సం.) రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడిని గుర్తించిన వారు లేదా వివరాలు తెలిసిన వారు రైటర్ రాజాబాబు (9705649492) కి తెలపాలని జీఆర్పీఎఫ్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 14, 2025
భీమవరం: అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాసం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ నాగరాణి పీజీఆర్ఎస్లో దేవాదాయ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్తీక మాసంలో దేవాలయాలు శోభాయమానంగా ఉండేలా సిద్ధం చేయాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పేరుపాలెం బీచ్ వద్ద సముద్ర స్నానాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.