News March 15, 2025
ప.గో: నెత్తురోడిన రహదారులు.. ఐదుగురు మృతి

శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందడం ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తాడేపల్లిగూడెం వద్ద హైవేపై వేగంగా వచ్చిన కారు ఆగిఉన్న లారీని ఢీకొట్టగా చిన్నారితో సహా తల్లిదండ్రులు <<15760017>>మృతి చెందారు.<<>> కృష్ణా(D) ఘంటలసాల(M) జీలగలగండిలోని హైవేపై <<15755822>>లారీని బోలెరో ఢీకొన్న<<>> ఘటనలో ప్రాతాళ్లమెరకకు చెందిన వర ప్రసాద్, శివకృష్ణ చనిపోయారు. నిద్రమత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
Similar News
News March 17, 2025
సబ్ కలెక్టరేట్లో పిజిఆర్ఎస్ కార్యక్రమం

నరసాపురం సబ్ కలెక్టరేట్లో ఈనెల 17న తేదీన సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నరసాపురం ఆర్డీవో దాసిరాజు తెలిపారు. డివిజన్లోని అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని వివరించారు. సబ్ డివిజన్లోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో యథావిధిగా జరుగుతుందన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులు, దరఖాస్తులను ఉదయం 10:30 గంటల నుంచి అందించాలని కోరారు.
News March 16, 2025
ప.గో.జిల్లా వ్యాప్తంగా 128 టెన్త్ పరీక్ష కేంద్రాలు

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 128 సెంటర్ల ద్వారా 22,432 మంది విద్యార్థులు హాజరు కానున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి ఇ. నారాయణ తెలిపారు. వీరిలో 11,407 మంది బాలురు కాగా 11,025 మంది బాలికలు ఉన్నారని చెప్పారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన కోరారు.
News March 16, 2025
మొగల్తూరు: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

ప.గో జిల్లాలో బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మొగల్తూరు SI నాగలక్ష్మి వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామంలో 8 ఏళ్ల బాలికపై అదే ఊరికి చెందిన జయరాజు(34) అత్యాచారం చేశాడు. ఈ ఘటన 11వ తేదీన జరగ్గా.. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నరసాపురం DSP శ్రీవేద ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.