News July 20, 2024
ప.గో.: నేడు పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సెలవు

విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున అన్ని పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు ప.గో., ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులు నాగమణి, అబ్రహం ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు ఆర్వో చంద్రశేఖర్ బాబు చెప్పారు.
Similar News
News November 15, 2025
భీమడోలు: ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన హత్య కేసు నిందితుడు

ఏడేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు ఎట్టకేలకు భీమడోలు పోలీసులకు చిక్కాడు. వివరాలు ఇలా.. 2018లో ఏలూరుకు చెందిన ఆటోడ్రైవర్ రామప్రసాద్ రాత్రి వేళ తన ఆటోతో వెళ్తుండగా గుడివాడకు చెందిన స్టీవెన్ అడ్డగించి.. రామప్రసాద్ను హత్య చేసి ఆటో ఎత్తుకెళ్లాడు. ఈ కేసులో స్టీవెన్ను అరెస్ట్ చేశారు. 2 వాయిదాల తర్వాత నిందితుడు కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. నిన్న గుడివాడలో అరెస్ట్ చేశారు.
News November 14, 2025
పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలి

జిల్లాలో పెద్ద ఎత్తున వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించాలని జేసి రాహుల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి నెల 3వ శనివారం పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ సంస్థలలో స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంగా పాటించాలన్నారు. వ్యక్తిగత, సమాజ పరిశుభ్రత కార్యక్రమాలను జిల్లా అంతట విస్తృతంగా నిర్వహించాలన్నారు.
News November 14, 2025
తణుకు: మహిళ కడుపులో భారీ కణితి తొలగింపు

తణుకు పట్టణంలోని ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో గురువారం అరుదైన చికిత్స నిర్వహించారు. పెనుగొండ మండలం దేవ గ్రామానికి చెందిన ఓ మహిళ తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చారు. కొన్ని నెలలుగా బాధపడుతున్న ఆమె గురువారం ఆసుపత్రికి రాగా..వైద్యురాలు పావని పరీక్షించి కణితి ఉన్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స చికిత్స చేసి 4 కిలోల కణితిని తొలగించారు.


