News April 10, 2024
ప.గో: నేడు ప్రజాగళం సభ.. CBN షెడ్యూల్ ఇదే

ప.గో జిల్లా తణుకు పట్టణంలో బుధవారం ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించనున్నారు. చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. మధ్యాహ్నం 3:35 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఎస్ఎంవీఎం పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 3:45 గంటలకు నరేంద్ర సెంటర్ చేరుకుంటారు. సాయంత్రం 5:30 వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 7:00 నుంచి 8:30 వరకు నిడదవోలులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
Similar News
News March 15, 2025
తాడేపల్లిగూడెం చేరిన తండ్రి, పిల్లల మృతదేహాలు

కాకినాడ సుబ్బారావు నగర్లో తన ఇరువురు <<15765374>>పిల్లల్ని<<>> చంపి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో తండ్రి వానపల్లి చంద్ర కిషోర్, పిల్లలు జోషిల్ (7), నిఖిల్ (6) భౌతిక కాయాలు శనివారం సాయంత్రం తాడేపల్లిగూడెం చేరుకున్నాయి. ఓఎన్జీసీ అంబులెన్స్ లో వారి భౌతిక కాయాలను తాడేపల్లిగూడెం పట్టణం పాతూరు అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ వెనుక ఉన్న మృతుడు చంద్రకిషోర్ తండ్రి సూరిబాబు నివాసానికి తీసుకొచ్చారు.
News March 15, 2025
భీమవరంలో యువతి ఆత్మహత్యాయత్నం

భీమవరం డీఎన్ఆర్ కళాశాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని చిన్న వంతెన మీద నుంచి మురికి కాలవలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు, శ్రీనివాస్ అనే యువకుడు ఆ యువతిని రక్షించారు. యువతికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమస్య ఏంటి అని అడగ్గా తమ తల్లిదండ్రులు విడిపోతున్నారని బాధతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపింది.
News March 15, 2025
తణుకు: సీఎం సభలో కీ పాయింట్స్.

తణుకులో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు పర్యటించారు. అందులో కొన్ని కీ పాయింట్స్…
1) పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పార్క్ శుభ్రం చేశారు.
2) మార్కెట్ వ్యాపారస్తులతో ముఖాముఖి.
3) రాగి పిండితో తయారుచేసిన కప్పులను తిలకించారు.
4) తణుకులో 42 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.
5) అక్టోబర్ 2న చెప్పకుండా వస్తా అన్నారు.
6) ప్రకృతిని నాశనం చేస్తున్న ప్లాస్టిక్.