News September 5, 2024
ప.గో : నేడే ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు

ప్రతి విద్యార్థి జీవితంలో ఒక గురువు ప్రభావం ఉంటుంది. విద్యార్థి భవిష్యత్ను తీర్చిదిద్దడంలో ఆ గురువు ఒక టార్చ్ బేరర్లా ఉంటాడు. అలాంటి గురువులను స్మరించుకునే ఈ రోజు గురుపూజోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రోజు పలువురు ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో సత్కరించనున్నారు. మరి మీ విద్యార్థి జీవితంలో మీకిష్టమైన ఉపాధ్యాయుడు ఎవరని భావిస్తున్నారో కామెంట్ చేయండి.
Similar News
News November 18, 2025
ఈ ఏడాదిలో 40.399 కేజీల గంజాయి సీజ్: ఎస్పీ

మాదకద్రవ్యాల నియంత్రణలో ఈ ఏడాది 12 కేసులు నమోదు అయ్యాయని, 55 మందిని అరెస్టు చేయగా 40.399 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ నయీం అస్మీ తెలిపారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. దీని విలువ సుమారు రూ.3,72,680 లు ఉంటుందని, 2 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 64 కేసుల్లో సీజ్ చేసిన మొత్తం 641.544 కిలోల గంజాయిని జూలై 9న దహనం చేయడం జరిగిందన్నారు.

ప.గో. జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా కందుల భాను ప్రసాద్

పశ్చిమగోదావరి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా భీమవరం పట్టణానికి చెందిన కందుల భాను ప్రసాద్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేశ్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళ్రావు చేతుల మీదుగా మంగళవారం ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఉక్కుసూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.