News May 11, 2024

ప.గో.: నేడే LAST.. గెలుపుపై మీ కామెంట్..?

image

ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. నేటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి. – మన ప.గో. జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది..?

Similar News

News July 5, 2025

ఈనెల 10న జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్: కలెక్టర్

image

ఈనెల 10న జిల్లాలో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించడం జరిగిందని, ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో కూడా పీటీఎం సమావేశాలు నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

News July 5, 2025

పాలకొల్లు: మూడు రోజుల వ్యవధిలో తల్లి కూతురు మృతి

image

పాలకొల్లులో ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం ఆడబిడ్డకు జన్మనిచ్చి తీవ్ర రక్తస్రావంతో సంగినీడి జయశ్రీ మృతి చెందిన విషయం తెలిసిందే. డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహారించారని ఆరోపిస్తూ ఆరోజు బంధువులు ఆందోళన చేపట్టారు. శిశువుకు వైద్యం కోసం భీమవరం తరలించారు. ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం వైద్యులు ఇంటికి పంపించేశారు. శనివారం ఉదయం శిశువు మృతి చెందింది. తల్లి, కూతురు మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

News July 5, 2025

ఆచంట: గోదారమ్మకు చేరుతున్న వరద నీరు

image

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటు పెరుగుతోంది. ఆచంట మండలంలో కోడేరు, పెదమల్లం, కరుగోరుమిల్లి, భీమలాపురం పుష్కర ఘాట్ల వద్దకు వరద నీరు చేరింది. పోలవరం వద్ద గోదావరికి వరద నీరు భారీగా చేరుకోవడంతో మరో రెండు, మూడు రోజుల్లో మరింత వరద ప్రవాహం ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.