News December 31, 2024
ప.గో: ‘న్యూఇయర్ వేడుకలను పేద విద్యార్థులతో జరుపుకుందాం’
నూతన సంవత్సర వేడుకలను జిల్లాలోని పేద విద్యార్థులతో జరుపుకుందామని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసిల్వి, ప.గో జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌లు మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో పేద విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేస్తే వారి చదువులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కొత్త సంవత్సరాన్ని ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు.
Similar News
News January 17, 2025
ప.గో: బరువెక్కిన గుండెతో పయనం
ప.గో జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు సంక్రాంతి పండుగ ముగించుకుని పట్టణాలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా పండుగ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. అప్పుడే పండుగ ముగిసిందా అన్నట్లుగా ఉద్యోగ, వ్యాపారాల రీత్యా పట్టణాలకు వెళ్తున్నారు. ఈసంక్రాంతి సంబరాలను రాబోయే పండగ వరకు నెమరువేసుకుంటూ సంతోషిస్తామని పలువురు ప్రయాణికులు తెలిపారు. పిండి వంటలతో పట్టణాలకు పయనమయ్యేవారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిశాయి.
News January 17, 2025
ఏలూరు: హీటర్ ఆన్ చేసి మరిచిపోయి వ్యక్తి సజీవదహనం
హీటర్ పెట్టి బకెట్ కరిగి కరెంట్ షాక్‌తో వ్యక్తి సజీవదహనమైన ఘటన ఏలూరులో గురువారం జరిగింది. కాకినాడకు చెందిన గంగాధర్ (30) తాత డెత్ సర్టిఫికెట్ కోసం ఏలూరులోని అక్క ఇంటికి వచ్చాడు. మద్యం తాగి నిద్రిస్తుండగా.. అక్క గడియ పెట్టుకుని బయటకు వెళ్లింది. గంగాధర్ లేచి నీళ్లు పెట్టుకుని మళ్లీ నిద్రపోయాడు. ఎక్కువ సేపు ఉండిపోవడంతో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని 1 టౌన్ CI సత్యనారాయణ పరిశీలించినట్లు తెలిపారు.
News January 17, 2025
మొగల్తూరులో అల్లుడికి 153 రకాల వంటకాల విందు
మొగల్తూరుకు చెందిన కెల్లా లక్ష్మీ కాంతం అల్లుడికి 153 రకాలతో విందు ఏర్పాటు చేశారు. తన కూతురు నాగలక్ష్మిని పాలకొల్లుకి చెందిన చిప్పాడ విజయ కృష్ణతో 29 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. కొత్త అల్లుడికి ఏమాత్రం తీసిపోకుండా 153 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.