News February 4, 2025

ప.గో: న్యూఢిల్లీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష

image

పీఎం లంక వద్ద సముద్రం కోత నిరోధానికి డిలైట్ కంపెనీ ప్రాజెక్టు పనులను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ లో న్యూఢిల్లీలోని డిలైట్ ప్రతినిధులతో వర్చువల్‌గా సమావేశమై పీఎం లంక ప్రాజెక్టుపై సమీక్షించారు. పీఎం లంక వద్ద సముద్రపు కోత గురికావడంతో దానికి అడ్డుకట్ట వేసే ప్రాజెక్టుకు ఒప్పందం కుదిరిందన్నారు.

Similar News

News February 8, 2026

ఉప ఉత్పత్తులపై మిల్లర్లు దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

రైస్ మిల్లర్లు విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి సారించాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. పెదఅమిరంలో శనివారం రైస్ మిల్ యజమానులు, పరిశ్రమ ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. మిల్లింగ్‌లో వచ్చే ఉప ఉత్పత్తులను సరిగ్గా వినియోగిస్తే ఆర్థికంగా బలపడవచ్చని తెలిపారు. బై ప్రొడక్ట్స్ వృథా కాకుండా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను మిల్లర్లు అందిపుచ్చుకోవాలని కలెక్టర్ కోరారు.

News February 8, 2026

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: డీపీఎంవో

image

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని డీపీఎంఓ డాక్టర్‌ సీహెచ్‌ ధనలక్ష్మి హెచ్చరించారు. శనివారం భీమవరంలో నిర్వహించిన డివిజన్ స్థాయి సలహా సంఘం సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను నిరంతరం తనిఖీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిని పట్టుకునేందుకు క్రమం తప్పకుండా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.