News June 14, 2024

ప.గో: పట్టు కోసం పదవులపై MLAల కన్ను

image

కొత్త ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం పూర్తయ్యింది. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పట్టుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అత్యంత ముఖ్యమైన జిల్లా పరిషత్‌, ఎంపీపీ, మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవులను తమ సొంతం చేసుకోవాలని నాయకులు తహతహలాడుతున్నారు. అందుకోసం ఎవరి అస్త్రాలను వారు ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News September 10, 2024

ఏలూరు: ఫోన్ ఇవ్వలేదని యువతి సూసైడ్

image

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన అన్నాచెల్లెలు జామాయిల్ నర్సరీలో పని చేసేందుకు కుక్కునూరు మండలం గణపవరం వచ్చారు. అక్కడ పనిని బట్టి వేతనం పొందేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. చెల్లెలు (18) పని సమయంలోనూ ఎక్కువ సేపు ఫోనుతో కాలక్షేపం చేస్తుండటంతో ఆమె సోదరుడు కోపంతో ఫోన్ లాక్కున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 10, 2024

ప.గో.: నేటి క్రీడా పోటీలు వాయిదా

image

పెదవేగిలోని గురుకుల బాలుర పాఠశాలలో నేడు జరగాల్సిన ఉమ్మడి ప.గో. జిల్లా జూనియర్ కళాశాలల అండర్-19 క్రీడా జట్ల ఎంపిక పోటీలను వర్షాల కారణంగా వాయిదా వేసినట్లు ఉమ్మడి జిల్లా కార్యదర్శి జయరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిగిలిన తేదీల్లో జరిగే పోటీలు యథావిధిగా ఉంటాయని చెప్పారు.

News September 10, 2024

ఏలూరు: 7 మండలాల్లో పాఠశాలలకు సెలవు

image

ఏలూరు జిల్లాలో వర్షాలు, వరదల ప్రభావానికి గురైన ఏడు మండలాల్లోని పాఠశాలలకు మంగళవారం (నేడు) సెలవు ప్రకటించినట్లు డీఈవో ఎస్.అబ్రహం ఓ ప్రకటనలో తెలిపారు. భీమడోలు మండలంలో ఒకటి, పెదపాడులో ఏడు, మండవల్లిలో 18, కైకలూరులో 9, ఏలూరులో 1, ముదినేపల్లిలో 3, కలిదిండి మండలంలో 5 పాఠశాలలకు సెలవు ప్రకటించామన్నారు. మిగతా పాఠశాలలు యథావిధిగా పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు.