News April 24, 2024
ప.గో: పదో తరగతి విద్యార్థులకు గమనిక

పదో తరగతి విద్యార్థుల మార్కుల జాబితాలను www.bse.ap.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని డీఈవో అబ్రహం తెలిపారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చెల్లించాలని పదో తరగతి అనుబంధ పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు ఈ నెల 30లోగా రుసుము చెల్లించాలన్నారు.
Similar News
News October 20, 2025
నరసాపురంలో కూతురిపై తండ్రి అత్యాచారం

నరసాపురంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఎస్ఐ విజయలక్ష్మి వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఓ మహిళ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లింది. కుమార్తె(13) 9వ తరగతి చదువుతోంది. భర్త మద్యానికి బానిసయ్యాడు. జులైలో కుమార్తె(13)పై మద్యం మత్తులో తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల తల్లి గల్ఫ్ నుంచి వచ్చింది. విషయం తెలుసుకుని పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది.
News October 20, 2025
భీమవరం: నేడు పీజీఆర్ఎస్ రద్దు

దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 20వ తేదీ (సోమవారం) జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. సోమవారం దీపావళి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు.
News October 20, 2025
పాలకోడేరు: నేడు PGRS కార్యక్రమం రద్దు

పాలకోడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) దీపావళి సందర్భంగా ఈ సోమవారం రద్దు అయినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వచ్చే సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.