News December 23, 2024
ప.గో: పార్సిల్‌లోని డెడ్‌బాడీని గుర్తించిన పోలీసులు
పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు రోజుల నుంచి మిస్టరీగా ఉన్న ఉండి మండలం యండగండి పార్సిల్లో డెడ్ బాడీ కేసులో పురోగతి లభించింది. డెడ్‌బాడీ ఎవరిదీ అనేది సోమవారం పోలీసులు గుర్తించారు. కాళ్ల మండలం గాంధీనగర్ చెందిన బర్రె పర్లయ్యగా పోలీసులు గుర్తించారు. అసలు డెడ్‌బాడీని అందులో పార్శిల్ చేసి తులసి ఇంటికి ఎందుకు పంపారు? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 24, 2024
ప.గో: ఎమ్మెల్సీని అభినందించిన సీఎం చంద్రబాబు
తూర్పు పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం మర్యాదపూర్వక కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గోపి మూర్తిని అభినందించారు. అనంతరం ఉపాధ్యాయ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
News December 23, 2024
ఉండి: శ్రీధర్ దొరికితేనే అన్నీ తేలుతాయి..!
ఉండిలో పార్శిల్లో డెడ్‌బాడీ కేసు ఓ కొలిక్కి రావడం లేదు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న తులసి చెల్లెల భర్త శ్రీధర్ వర్మ మూడు పేర్లతో మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. తులసితో ఆస్తి తగాదాలు ఉన్న క్రమంలో అతనే ఓ మహిళ సాయంతో తులసి ఇంటికి డెడ్‌బాడీ పంపాడని సమాచారం. ఆ డెడ్‌బాడీ ఎవరిది? పార్శిల్ తీసుకెళ్లాలని ఆటో డ్రైవర్‌కు చెప్పిన మహిళ ఎవరు? అనే ప్రశ్నలకు శ్రీధర్ చిక్కితేనే సమధానం తెలుస్తుంది.
News December 23, 2024
సంక్రాంతికి రెడీ అవుతున్న కోళ్లు
కోడి పందేలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. సంక్రాంతి వస్తుందంటే మూడు రోజులు పందేలు జోరుగా సాగుతుంటాయి. గెలుపే లక్ష్యంగా కోళ్లను సిద్దం చేస్తున్నారు. బలమైన ఆహారాన్ని తినిపించడంతో పాటు, కొలనులలో ఈత కొట్టించడం, వాకింగ్ చేయించడం చేస్తున్నారు. భీమవరం, నరసాపురం, జంగారెడ్డిగూడెం, ద్వారకాతిరుమల, తాడేపల్లిగూడెంలో పందాలు జరుగుతుంటాయి. పందేలకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తుంటారు.