News February 5, 2025

ప.గో: పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఎర వేస్తారు

image

ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌లకు ఉమ్మడి ప.గో జిల్లాలోని యువత బానిసలవుతున్నారు. చిరువ్యాపారులు, నిరుద్యోగులు ఆన్‌లైన్ జూదానికి అలవాటు పడి రోడ్డున పడుతున్నారు. ఇటీవల భీమవరంలో ఓ చిరు వ్యాపారి రూ.10 లక్షలు పోగొట్టుకున్నారు. అనంతరం అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని, పిల్లలను పెద్దవారు నిత్యం గమనిస్తుండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Similar News

News October 14, 2025

భారత తొలి IFS అధికారిణి గురించి తెలుసా?

image

మధ్యతరగతి మహిళ గడప దాటడమే కష్టమైన రోజుల్లో ధైర్యంగా బడికెళ్లి చదువుకున్నారు IFS అధికారిణి ముత్తమ్మ. ‘ఇది మహిళల సర్వీస్ కాదు’ అన్న UPSC ఛైర్మన్ లింగ వివక్షనూ ఎదుర్కొన్నారామె. వివాహిత మహిళల సర్వీసు హక్కు కోసం సుప్రీంలో పోరాడారు. 1949లో తొలి IFS అధికారిణిగా నియమితులై చరిత్ర సృష్టించారు. మహిళలందరికీ స్ఫూర్తిగా నిలిచిన ముత్తమ్మ 2009లో చనిపోయారు. * ఉమెన్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.

News October 14, 2025

HYD: జాతీయ సదస్సు.. OU ప్రొ.మాధవి ప్రసంగం

image

మహారాష్ట్రలోని నాందేడ్‌ యశ్వంత్ మహావిద్యాలయంలో ప్రధాన మంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ (PM-UShA) భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ మేరకు OUలోని జువాలజీ విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ ఎం.మాధవిని ఆహ్వానించింది. ‘విక్షిత్ భారత్ కోసం ఆరోగ్యం, ఆహారం, స్థిరత్వం భవిష్యత్తును రూపొందించడం’ అనే అంశంపై ప్రొఫెసర్ మాధవి అంతర్దృష్టితో కూడిన ఆకర్షణీయమైన ప్రసంగం ఇచ్చారు.

News October 14, 2025

KNR: ‘పూర్వ ప్రాథమిక కేంద్రాల్లో నమోదు పెరగాలి’

image

కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎంఈఓలు, ఎంపీడీవోలు, సీడీపీవోలతో పూర్వ ప్రాథమిక పాఠశాలలపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ప్రీ ప్రైమరీ కేంద్రాలలో నమోదును పెంచాలని, ప్రతి కేంద్రంలో 20 మంది పిల్లలు తగ్గకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి మొండయ్య, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, తదితరులు ఉన్నారు.