News May 26, 2024
ప.గో.: పెన్సిల్‌పై ‘గెట్ రెడీ SRH’

IPL-2024 ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం విజయం సాధించాలని ఓ కళాకారుడు పెన్సిల్‌పై ఆంగ్లంలో గెట్ రెడీ SRH అంటూ చెక్కారు. ప.గో. జిల్లా నరసాపురం పట్టణంలోని రుస్తుంబాదకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కొప్పినీడి విజయ్ SRH విజయాన్ని కాంక్షిస్తూ ఈ కళాఖండాన్ని ఆవిష్కరించారు. కాగా ఆయన లిఖితపూడి సచివాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్నారు.
Similar News
News February 16, 2025
యలమంచిలి: 45 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టివేత

యలమంచిలి మండలంలో చించినాడ హైవే వద్ద శనివారం నరసాపురం నుంచి తూర్పుగోదావరి జిల్లాకి మినీ లారీలో తరలిస్తున్న 45 క్వింటాళ్ల పీడీఎస్ రైసును విజిలెన్స్ సీఐ డి. ప్రసాద్ కుమార్ పట్టుకున్నారు. మినీ లారీని, బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. యలమంచిలి సివిల్ సప్లై డీటీ అయితం సత్యనారాయణ ఉన్నారు.
News February 15, 2025
పాలకొల్లులో సందడి చేసిన జబర్దస్త్ అప్పారావు

జబర్దస్త్ నటుడు అప్పారావు శనివారం పాలకొల్లులో ఓ వివాహ వేడుకకు హాజరై సందడి చేశారు. జబర్దస్త్, పలు నాటికలతో ఆయన ప్రేక్షకులకు సుపరిచితులు. వరుడి తండ్రి తన స్నేహితుడు కావడంతో ఈ వివాహానికి హాజరైనట్లు అప్పారావు తెలిపారు. ఆయన రాకతో వివాహ వేడుకలో సందడి నెలకొంది. పలువురు సెల్ఫీలు దిగారు.
News February 15, 2025
ప.గో : బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. రోడ్డున పడ్డ కూలీలు

ప.గో జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభించి కోళ్ల యజమానులకు తీవ్ర నష్టం వాటిల్లుతోన్న విషయం తెలిసిందే. అయితే ముఖ్యంగా జిల్లాలో తణుకులోని వేల్పూరు, ఉంగుటూరులోని బాదంపూడి, పెరవలిలోని కానూరు అగ్రహారం గ్రామాల్లో బర్డ్ ఫ్లూ తీవ్రత అధికంగా చూపింది. దీంతో సుమారు 40 ఫారాలు మూతలు పడగా.. పొట్టకూటికి వచ్చిన 3200 మంది కూలీలు ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణ కష్టతరం కానుంది.