News December 17, 2024
ప.గో: పేరుపాలెం బీచ్‌లో అద్భుతమైన దృశ్యం

మొగల్తూరు మండలంలోని ప్రముఖ పర్యాటక క్షేత్రం పేరుపాలెం బీచ్‌లో సోమవారం సాయంత్రం అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. సాయంత్రం ఐదు గంటల సమయంలో సూర్యాస్తమయం అవుతూ ఎర్రటి సూర్యుడి వెలుగు సముద్ర అలలుపై పడుతూ ప్రకృతి రమణీయ దృశ్యకావ్యం కనిపించింది. దీంతో బీచ్‌కు వచ్చిన పర్యాటకులు సెల్ఫోన్లో ఈ చిత్రాన్ని బంధించారు.
Similar News
News November 26, 2025
ప.గో: సమస్యలకు చెక్.. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని ప.గో జాయింట్ కలెక్టర్ రాహుల్ సూచించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొనుగోలు, రవాణా, తూకంలో సమస్యలుంటే 81216 76653, 1800 425 1291 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. కొనుగోళ్లకు రైతు సేవా కేంద్రాలను సిద్ధం చేశామని, రైతులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

జిల్లా మొదటి స్థానంలో ఉండాలి: కలెక్టర్

ప.గో జిల్లా పరిశుభ్రమైన జిల్లాగా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే విధంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. తడి చెత్త, పొడి చెత్త విభజనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యర్థ పదార్థాల నుంచి సంపద సృష్టించే SWPC షెడ్లు ప్రతి మండలంలో నిర్వహణలోకి తీసుకురావాలన్నారు.