News June 5, 2024

ప.గో.: పోలవరం టెన్షన్.. టెన్షన్

image

పోలవరం ఓట్ల లెక్కింపులో వైసీపీ, కూటమి అభ్యర్థుల మధ్య విజయం దోబూచులాడింది. తొలిరౌండ్లో ఆధిక్యం కనబర్చిన వైసీపీ అభ్యర్థి రాజ్యలక్ష్మి తిరిగి 4వ రౌండులో ఆధిక్యం అందిపుచ్చుకున్నారు. ఆ తర్వాత రౌండ్లలో జనసేన అభ్యర్థి పోలవరం బాలరాజు జోరందుకోగా 8, 9, 10, 11 రౌండ్లలో తిరిగి వైసీపీ అభ్యర్థి ఆధిక్యతను నిలుపుకొనే ప్రయత్నం చేశారు. 14- 20వ రౌండ్ వరకు బాలరాజు మళ్లీ జోరు చూపి 7935 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Similar News

News February 25, 2026

ఏకీకృత కుటుంబ సర్వేను పూర్తి చేయాలి: కలెక్టర్

image

యలమంచిలి మండలంలో ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం యలమంచిలి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. మండలంలో సాగుతున్న ఏకీకృత కుటుంబ సర్వే, ఈ-కేవైసీ, పీ-4 కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలన్నారు.

News February 25, 2026

కాళ్ల: కలెక్టర్‌ను కలిసిన వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు

image

కలెక్టర్‌ నాగరాణిని భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల బృందం బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది. పెదఅమిరం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో డా. మానస, డా. జాగృతి రోహిత్, డా. రాఘవేంద్ర, డా. సతీష్‌ చవాన్ పాల్గొన్నారు. భవిష్యత్తులో జిల్లాలో వరి సాగుపై రైతులకు మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టే అంశంపై చర్చించారు. రైతుల సంక్షేమం కోసం వినూత్న ప్రయోగాలు చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.

News February 25, 2026

ప.గో: ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ

image

ప.గో జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఈ నెల 28నే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. మార్చి 1 ఆదివారం కావడంతో, ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పంపిణీకి ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. జిల్లాలోని 2,22,982 మంది లబ్ధిదారులకు రూ. 96.39 కోట్లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. శనివారం ఉదయమే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేయాలని అధికారులను ఆదేశించారు.