News June 5, 2024
ప.గో: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ తపాలా బ్యాలెట్ ఓట్ల సాధనలో కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. భీమవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుకు అత్యధికంగా 1,723 తపాలా ఓట్లు వచ్చాయి. పాలకొల్లు 1,643, తణుకు 1,593, తాడేపల్లిగూడెం 1,488, నరసాపురం 1,075, ఉండి 960, ఆచంట 973, నిడదవోలు1,090, కొవ్వూరు 1,023, గోపాలపురం 744 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి.
Similar News
News January 2, 2026
ప.గో: ‘వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి’

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం-2026 సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి గోడపత్రికలు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తతతో ఉండాలన్నారు.
News January 1, 2026
భీమవరం: కేంద్ర మంత్రి వర్మకు న్యూఇయర్ శుభాకాంక్షలు

కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను గురువారం ఆయన కార్యాలయంలో పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కలెక్టర్ చదలవాడ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు మంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, పలు ప్రజాహిత అంశాలపై వారు చర్చించారు.
News January 1, 2026
ప.గో: లక్ష్యం1,780.. కట్టింది ఏడే

కాళ్ల మండలం పెదమిరం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ నాగరాణి గృహ నిర్మాణాలపై సమీక్షించారు. పీఎంఏవై 1.0 (ఆప్షన్-3) కింద 2025 డిసెంబర్ నాటికి 1,780 ఇళ్లు నిర్మించాల్సిన ‘అజాయ వెంచర్స్’ సంస్థ.. కేవలం 7 మాత్రమే పూర్తి చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం లక్ష్యం చేరుకోనందున సదరు నిర్మాణ సంస్థపై పోలీసు కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.


