News June 5, 2024
ప.గో: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ తపాలా బ్యాలెట్ ఓట్ల సాధనలో కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. భీమవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుకు అత్యధికంగా 1,723 తపాలా ఓట్లు వచ్చాయి. పాలకొల్లు 1,643, తణుకు 1,593, తాడేపల్లిగూడెం 1,488, నరసాపురం 1,075, ఉండి 960, ఆచంట 973, నిడదవోలు1,090, కొవ్వూరు 1,023, గోపాలపురం 744 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి.
Similar News
News December 10, 2024
వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారు: కారుమూరి
తణుకు పద్మశ్రీ ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఉమ్మడి ప.గో.జిల్లా నియోజకవర్గ ఇన్చార్జీలు, ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ, ఉభయగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేసే తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారని అన్నారు.
News December 10, 2024
భీమవరం: జాయింట్ కలెక్టర్ ఆగ్రహం
ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం భీమవరం మండలం జువ్వలపాలెం రోడ్డులోని ఓ పూల దుకాణం వద్దకు ఆయన వచ్చారు. పూలను ప్లాస్టిక్ కవర్స్‌లో ఇస్తుండటంతో దుకాణ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వాడకం నిషేధంలో ఉండగా ప్లాస్టిక్ కవర్లు ఎందుకు వాడుతున్నారని గట్టిగా నిలదీశారు.
News December 10, 2024
ప.గో: నిధుల దుర్వినియోగం.. క్రిమినల్ చర్యలకు కలెక్టర్ ఆదేశం
యలమంచిలి మండలం చించినాడ పంచాయతీలో పనిచేస్తున్న సెక్రటరీ జయరాజు రూ.14,94,224, ముత్యాలపల్లి సెక్రటరీ కృష్ణంరాజు రూ.1,99,50,956, చినఅమిరం పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ సుమనాగ్ రూ.15,98,455 ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కలెక్టర్ నాగరాణి సోమవారం తెలిపారు. వీరిపై క్రిమినల్ చర్యల నిమిత్తం భీమవరం తాహశీల్దార్‌కు ఆదేశాలు ఇచ్చామన్నారు. నిధులు మళ్లింపుకు సహకరించిన వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు.